వేసవి సెలవులతో పాటు వివిధ పరీక్షల ఫలితాల వెల్లడి కావడం, పైగా వీకెండ్ రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, వీరికి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. అలాగే, స్లాటెడ్ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు కూడా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కోసం భక్తులు రెండు మూడు గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టలతో పాటు శ్రీవారి ఆలయ ప్రాంతం, తిరుమాడ వీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కాగా, నిన్న శ్రీవారిని 78, 821 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33, 568 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, స్వామివారి హుండీ ఆదాయం 3.36 కోట్ల రూపాయలు వచ్చింది. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పహారం, పాలు, టీ అందిస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: