రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, కృష్ణాష్టమి, వినాయక చవితి లాంటి పండుగల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించబడ్డాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థులు కుటుంబాలతో కలిసి చిన్న టూర్లకు వెళ్లవచ్చు లేదా ఇంట్లోనే రిలాక్స్ అవుతూ మంచి సమయాన్ని గడిపేందుకు అవకాశం ఉంది.
ఆగస్టులో సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి: 🔸 ఆగస్ట్ 8 (శుక్రవారం) – వరలక్ష్మీవ్రతం
🔸 ఆగస్ట్ 9 (శనివారం) – రెండో శనివారం
🔸 ఆగస్ట్ 10 (ఆదివారం) – సాధారణ సెలవు
🔸 ఆగస్ట్ 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
🔸 ఆగస్ట్ 16 (శనివారం) – శ్రీకృష్ణాష్టమి
🔸 ఆగస్ట్ 17 (ఆదివారం) – ఆదివారపు సెలవు
🔸 ఆగస్ట్ 27 (బుధవారం) – వినాయక చవితి
ఇవన్నీ కలిపితే, విద్యార్థులకు ఈ నెల మొత్తం సెలవుల వాతావరణంగా మారనుంది. అలాగే, ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజుల్లో సాధారణ తరగతులు జరగకపోవచ్చు. మొత్తంగా ఆగస్టు నెల విద్యార్థులకు ‘ఎంజాయ్ మూడ్’ తీసుకొచ్చేలా ఉంది.