Header Banner

ఏపీలో ఆ ఉద్యోగులందరికి గుడ్‌న్యూస్..! జీతాలు డబుల్, ఉత్తర్వులు జారీ!

  Thu May 08, 2025 09:56        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఉద్యోగులందరికి తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీ వేతనాలు పెంచారు. ఈ మేరకు జీతాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గెస్ట్ ఫ్యాకల్టీకి గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే దాన్ని గంటకు రూ.375 చొప్పున గరిష్ఠంగా నెలకు రూ.27,000 ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత కొన్నేళ్లుగా వేతనం పెంచాలని గెస్ట్ ఫ్యాకల్టీ కోరుతున్నా పట్టించుకోలేదు. వారి సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం జీతాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఇంటర్మీడియట్‌ విద్యలో పని చేస్తున్న 3,572 మంది ఒప్పంద లెక్చరర్ల సర్వీసును పునరుద్ధరిచారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్‌ 1 నుంచి 2026 ఏప్రిల్‌ 30 వరకు వీరి సేవలను పునరుద్ధరించారు. ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న వారు 3,619 మంది ఉండగా.. వీరిలో 60 ఏళ్లు పూర్తయిన 47 మందిని మినహాయించారు. ఒప్పంద లెక్చరర్లు గతేడాది మే నెలలో పని చేసిన కాలానికి జీతం ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం మరికొన్ని అప్డేట్స్

మరోవైపు దివ్యాంగ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా డీఎస్సీ కోచింగ్‌ అందించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ రవిప్రకాశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. mdfc.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం 40 శాతం వైకల్యమున్న వారు మాత్రమే అర్హులన్నారు. ఇటు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం ప్రధాన గేటు వద్ద ఉద్యోగులు, సందర్శకుల కోసం బయోమెట్రిక్‌ ఆధారిత యాక్సెస్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం రూ.75.66 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

గ్రామాల్లో దశాబ్దాల నాటి 400 తాగునీటి కొనేరుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆదేశాలపై జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వివిధ గ్రామాల్లో కొనేరులను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. 2025 జూన్‌ నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

అలాగే సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రాన్ని స్విట్జర్లాండ్‌ రాయబారి మాయా టిస్సాఫీ, ప్రతినిధులు సందర్శించారు. ఆర్టీజీఎస్ ద్వారా అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వాతావరణ మార్పులను సాంకేతిక అనుసంధానంతో పర్యవేక్షించేందుకు అవేర్‌ హబ్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్టీజీఎస్‌ సీఈవో ప్రఖర్‌జైన్‌ తెలిపారు. ‘మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు అవసరమైన 290 రకాల సేవలు అందిస్తున్నాం. వాటిని వెయ్యికి పెంచే ప్రతిపాదన ఉంది’ అన్నారు.


ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APEmployees #SalaryHike #DoublePay #GoodNews #AndhraPradesh #GovernmentOrders