LIVE
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!  •  MATA: మాటా జాతీయ మహాసభల్లో క్రీడా విజేతలకు ఘన సన్మానం!  •  TCA: టీసీఏ ‘హ్యూస్టన్ ఐడల్’కు రంగం సిద్ధం.. ప్రవాస తెలుగు ప్రతిభకు భారీ వేదిక!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Tourism: పాపికొండల పర్యాటకంపై పులి ప్రభావం.. భయంతో తగ్గిన సందర్శకుల రద్దీ!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  •  Janhvi Kapoor: జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ కెమెరా యాంగిల్స్ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్!  •  AP News: గోదావరి రైతాంగానికి తీపి కబురు.. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మార్పునకు ప్రభుత్వం ముహూర్తం! రూ.124 కోట్లతో..  • 
NRI

Donald Trump: షాకింగ్.. ఒకవైపు రూ. 19 కోట్ల టికెట్.. మరోవైపు ఫ్రీగా బుకింగ్! ఫిఫా వెబ్‌సైట్‌లో ఏం జరిగిందంటే?

Donald Trump: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిర్వహణలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. 2026 ఫిఫా ప్రపంచకప్ కోసం కొందరు అభిమానులు ఉచితంగా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.

AndhraPravasi News Desk 2 min read
Donald Trump: షాకింగ్.. ఒకవైపు రూ. 19 కోట్ల టికెట్.. మరోవైపు ఫ్రీగా బుకింగ్! ఫిఫా వెబ్‌సైట్‌లో ఏం జరిగిందంటే?
  • North America: సుమారు 60 మందికి ఉచితంగా దక్కిన ప్రపంచకప్ టిక్కెట్లు..
     
  • సరైన ధర చెల్లించి టిక్కెట్లను తిరిగి పొందాలని అభిమానులకు సూచన..

Donald Trump: ఫుట్‌బాల్ ప్రేమికులకు ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఏదైనా ఉందీ అంటే అది ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) మాత్రమే. ప్రస్తుతం 2026 ఫిఫా వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఈ టికెట్ల బుకింగ్‌లో తాజాగా ఒక విచిత్రమైన, నవ్వు తెప్పించే ఘటన జరిగింది. వెబ్‌సైట్‌లో వచ్చిన ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల కొందరు అదృష్టవంతులైన అభిమానులకు అసలు రూపాయి కూడా ఖర్చు లేకుండా, పూర్తిగా ఉచితంగా (0 డాలర్లకే) టికెట్లు దొరికేశాయి!

ఇంకేముంది.. "మాకు లాటరీ తగిలిందోచ్‌" అని ఆ అభిమానులు సంబరపడిపోయారు. కానీ, వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందో, ఫిఫా ఆ తర్వాత ఎలాంటి షాక్ ఇచ్చిందో మనం ముచ్చటించుకుందాం.

అసలేం జరిగింది? '0 డాలర్ల' టికెట్ కథేంటి?
మే 21న ఫిఫా అధికారిక టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో చెక్‌అవుట్ (పేమెంట్) చేసే సమయంలో ఒక సాంకేతిక లోపం (గ్లిచ్) తలెత్తింది. టికెట్ల ధరలను సిస్టమ్ సరిగ్గా రీడ్ చేయకపోవడంతో, సుమారు 60 మంది అభిమానులకు టికెట్ ధర సున్నా డాలర్లుగా చూపించింది. వారు కూడా ఆలస్యం చేయకుండా 'ఉచితం'గా బుకింగ్స్ పూర్తి చేసేశారు.

ఫిఫా యాజమాన్యం ఈ పొరపాటును ఆలస్యంగా గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగి ఆ 60 మంది అభిమానులకు అర్జంట్‌గా ఈ-మెయిల్స్ పంపింది. "సాంకేతిక లోపం వల్ల మీకు టికెట్లు ఫ్రీగా వచ్చాయి. కాబట్టి వాటిని మేము రద్దు చేస్తున్నాం" అని బాంబు పేల్చింది. ఒకవేళ బుకింగ్ చార్జీల కింద ఏవైనా పైసలు కట్ అయి ఉంటే, అవి రిఫండ్ చేస్తామని చెప్పింది.

ఫిఫా ఇచ్చిన 'ఆఫర్'.. 7 రోజుల్లో తేల్చాలి!
ఉచిత టికెట్లను రద్దు చేసినప్పటికీ.. అభిమానులు బాగా హర్ట్ అవుతారని ఫిఫా ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. ఆ 60 మంది బుక్ చేసుకున్న సీట్లను క్యాన్సిల్ చేయకుండా, వారి అకౌంట్లలోనే 'రిజర్వ్' చేసి ఉంచింది.

మెయిల్‌ అందిన 7 రోజుల్లోగా ఆ టికెట్‌కు సంబంధించిన అసలు ధరను ఆన్‌లైన్‌లో చెల్లించి, వాటిని పక్కా చేసుకోవాలని సూచించింది. లేదంటే ఆ టికెట్లను వేరే వాళ్లకు అమ్మేస్తామని క్లియర్ గా చెప్పేసింది. తమ వెబ్‌సైట్ లోపం వల్ల జరిగిన అసౌకర్యానికి ఫిఫా క్షమాపణలు కూడా కోరింది.

ఆకాశాన్ని అంటుతున్న టికెట్ల ధరలు!
ఈ 'ఫ్రీ టికెట్ల' గోల ఒకవైపు నడుస్తుంటే.. మరోవైపు ఫిఫా 2026 వరల్డ్ కప్ టికెట్ల ధరలు చూసి సామాన్య అభిమానుల గుండె గుభేల్ అంటోంది. ఇప్పటికే రేట్లు మిన్నంటుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

ఒక రీసేల్ (బ్లాక్ మార్కెట్ లాంటి) సైట్‌లో జూలై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం కొన్ని టికెట్లను అమ్మకానికి పెట్టారు. అందులో ఒక్కో టికెట్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా 2.3 మిలియన్ డాలర్లు! అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 19 కోట్లు! ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి ఇన్ని కోట్ల రూపాయలా అని జనాలు నోరెళ్లబెడుతున్నారు.

కోట్ల రూపాయల ధర పలుకుతున్న ఫిఫా టికెట్లు.. కేవలం వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్ తప్పు వల్ల ఫ్రీగా రావడం, ఆ తర్వాత ఫిఫా దాన్ని పట్టుకుని రద్దు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ 60 మంది అభిమానులు మాత్రం "అబ్బా.. కాసేపైనా వరల్డ్ కప్ టికెట్ ఫ్రీగా దొరికిన అదృష్టవంతులుగా బతికాం" అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది!

Be the first to react

More Coverage

TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!

TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!

TTS: అమెరికాలోని నాష్‌విల్లే నగరంలో టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెన్స్ డబు…

US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!

US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!

US Job Market: అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన ఓ మహిళ, తాను నడుపుతున్న ఇండియన్ రెస్టారెంట్‌ల…