ఇసిఐఎల్ (ECIL) — దేశంలో ప్రసిద్ధి గాంచిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. అటామిక్ ఎనర్జీ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ ఇప్పుడు మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇది నిరుద్యోగ యువతకు నిజమైన గోల్డెన్ ఛాన్స్‌గా చెప్పొచ్చు.
ఉద్యోగాల ఖాళీలు – మొత్తం 90 పోస్టులు!
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రాజెక్ట్ ఇంజినీర్ – 27 పోస్టులు
టెక్నికల్ ఆఫీసర్ – 37 పోస్టులు
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ – 10 పోస్టులు
సీనియర్ ఆర్టిజన్ – 15 పోస్టులు
జూనియర్ ఆర్టిజన్ – 1 పోస్టు
విద్యార్హతలు
ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్: B.Tech లేదా B.E. పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు.
ఆర్టిజన్ పోస్టులు: ఐటీఐ (ITI)లో ఉత్తీర్ణత సాధించిన వారికి అవకాశం ఉంది.
అంటేఇంజినీరింగ్ నుంచి ఐటీఐ వరకు చదివిన ప్రతి ఒక్కరికీ ఇది మంచి అవకాశం.
వేతనాలు
ఈసిఐఎల్‌లో ఉద్యోగం అంటే వేతనం కూడా తగిన స్థాయిలో ఉంటుంది.
ప్రాజెక్ట్ ఇంజినీర్: మొదటి సంవత్సరంలో నెలకు ₹40,000 నుంచి ప్రారంభమై, నాలుగో ఏడాదికి ₹55,000 వరకు పెరుగుతుంది.
టెక్నికల్ ఆఫీసర్: నెలకు ₹25,000 నుంచి ₹31,000 వరకు వేతనం.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: నెలకు ₹25,506.
ఆర్టిజన్ పోస్టులు: ₹23,000 వరకు వేతనం లభిస్తుంది.
ఇకపోతే, అనుభవం, ప్రాజెక్టు పనితీరు ఆధారంగా అదనపు బెనిఫిట్లు కూడా ఉంటాయి.
వయోపరిమితి వివరాలు
ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయసు: 33 సంవత్సరాలు
ఇతర పోస్టులకు: 30 సంవత్సరాలు
వయోపరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ కేటగిరీలకు వర్తిస్తుంది.
ఎంపిక విధానం
ఈసిఐఎల్‌లో ఎలాంటి రాత పరీక్షలు లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.
అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ తర్వాత నిర్దిష్ట తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.ఇది పరీక్షా ఒత్తిడి లేకుండా సింపుల్‌గా ఉద్యోగం పొందే అరుదైన అవకాశం అని చెప్పొచ్చు.
ఇంటర్వ్యూ తేదీలు & కేంద్రాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
నగరం జోన్ ఇంటర్వ్యూ తేదీలు
న్యూఢిల్లీ (నార్త్ జోన్) - అక్టోబర్ 15
హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్ అక్టోబర్ 17
ముంబై (వెస్ట్ జోన్) అక్టోబర్ 17
చెన్నై (సౌత్ జోన్) అక్టోబర్ 17
కోల్‌కతా (ఈస్ట్ జోన్) అక్టోబర్ 18
బెంగళూరు (సౌత్ జోన్) అక్టోబర్ 18
హైదరాబాద్‌లోనే హెడ్‌క్వార్టర్స్ ఉండటం వలన స్థానిక అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
దరఖాస్తు విధానం
ఆసక్తి గల అభ్యర్థులు ECIL అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in
http://www.ecil.co.in లో లాగిన్ అయ్యి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన తర్వాత, ఇంటర్వ్యూ రోజున అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫోటోలు, ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా పరీక్షల ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నా అని అనుకునే ప్రతి యువకుడూ ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. హైదరాబాద్‌లోనే ఇంటర్వ్యూ ఉండటంతో స్థానిక అభ్యర్థులకు ఇది మరింత సౌలభ్యంగా ఉంటుంది