ఇజ్రాయెల్–హమాస్ మధ్య శాంతి ఒప్పందం… భారతదేశం నుంచి హాజరైన వారు ఎవరంటే ?

తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త విప్లవాత్మక మార్పు రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి భాగంగా “హెలీ టూరిజం” ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్‌ సర్వీసులు ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రైవేట్‌ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయనుంది. ప్రముఖ ట్రావెల్‌ సంస్థలు “ఈజ్ మై ట్రిప్” వంటి కంపెనీలతో చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయి. తొలి దశలో వారాంతాల్లో ట్రయల్‌ రన్స్‌ చేపట్టి, ప్రజల ఆదరణ ఆధారంగా సేవలను విస్తరించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

CRDA Office: అమరావతిలో కొత్త CRDA భవనం! సీఎం చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం!

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు నల్లమల అడవుల గుండా సాగనున్న ఈ హెలీ టూర్‌ రూట్‌ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు సోమశిల, అమరగిరి, నల్లమల అరణ్య సౌందర్యాలను ఆకాశం నుంచి వీక్షించే అవకాశం పొందనున్నారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్నందున, ఈ ప్రాజెక్ట్‌ను రెండు రాష్ట్రాల సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ఈ ప్రయాణానికి 5–6 గంటలు పడుతుండగా, హెలికాప్టర్‌ సర్వీసుతో కేవలం గంటలోపే గమ్యాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇది ఉద్యోగులు, కుటుంబాలు, అంతర్జాతీయ పర్యాటకులకు వీకెండ్‌ ట్రిప్‌గా సౌకర్యవంతమైన ఎంపికగా నిలుస్తుంది.

ఇసిఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు – పరీక్షలు లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక!

ప్రతి హెలికాప్టర్‌లో 6 నుంచి 8 మంది వరకు ప్రయాణించే సీటింగ్‌ సామర్థ్యం ఉంటుంది. ఈ టూర్‌ను 2–3 రోజుల ప్యాకేజీ రూపంలో రూపొందిస్తూ, ఇందులో ప్రయాణం, దర్శనం, వసతి వంటి సదుపాయాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ త్వరలో టికెట్‌ ధరలను ఖరారు చేసి, బుకింగ్‌ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ మరియు మొబైల్‌ యాప్‌ ప్రారంభించనుంది. హెలీ టూరిజం పథకం విజయవంతమైతే, తదుపరి దశలో వరంగల్‌, ములుగు జిల్లాల్లోని రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలకు కూడా హెలికాప్టర్‌ సర్వీసులను విస్తరించాలనే ప్రణాళిక ఉంది.

Praja Vedika: నేడు (13/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

సంక్రాంతి నాటికి ఈ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చి, రాష్ట్రాన్ని జాతీయ పర్యాటక మ్యాప్‌లో ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే ఈ హెలీ టూరిజం ప్రాజెక్ట్‌ తెలంగాణ అభివృద్ధి దిశలో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Development Leader: అభివృద్ధి సారథిగా చంద్రబాబు! 15 ఏళ్ల పాలన విశ్లేషణ!
AP Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! ఈ పంటలు సాగు చేస్తే రూ.30వేల నుంచి రూ.2.70 లక్షలు ఇస్తారట!
H-1B వీసాలకు భారీ షాక్..! ట్రంప్ నిర్ణయం భారత్ ఐటీ రంగం గందరగోళంలో..!
ఆ ప్రాంతంలో ఇంధన ధరల్లో భారీ వ్యత్యాసం – పెట్రోల్‌పై రూ.9, డీజిల్‌పై రూ.7 తేడా!
Tirumala Darshanam: తిరుమల భక్తులకు.. ఈ నెల 25 న అపురూప దర్శనం!
Pelican Valley: ఏపీలో యువతకు ఉద్యోగాల పండుగ! రూ.250 కోట్ల పెట్టుబడితో పెలికాన్ వ్యాలీ ఐటీ పార్క్!