ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలోని అధికారిక కార్యాలయంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ తో ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని చేసుకోబోతున్నారు. ఈ ఒప్పందాన్ని ఆయన తన రాజకీయ జీవితంలో ప్రత్యేక ఘట్టంగా అని తెలిపారు.
సీఎం చంద్రబాబు ఈ ఒప్పందం ద్వారా 2029 నాటికి విశాఖపట్నంలో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణం పూర్తి కానుందని ఇది విశాఖను డేటా హబ్ గా మార్చబోతోంది. అంతేకాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కూడా విశాఖ కొత్త రూపాన్ని పొందబోతోంది వివరించారు.
గత ప్రభుత్వాల వల్ల రాష్ట్రం కొన్ని చోట్ల దెబ్బతిన్న పరిస్థితిలో ఉండగా ఇప్పుడు పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించడం రాష్ట్రంలో పెద్ద పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవడం లక్ష్యం. గూగుల్ వంటి పెద్ద సంస్థలు ఇప్పుడే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అయితే పెట్టుబడులు వస్తున్నప్పటికీ, కొంతమంది వ్యతిరేకులు లేదా బెదిరింపులు చూపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. నవంబరులో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు.
పార్టీ విషయాలపై మాట్లాడుతూ సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడం మరియుయువ నాయకులను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. యువతకు రాజకీయ శిక్షణ ఇవ్వడానికి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటవుతుందని తెలిపారు.
విశాఖలో ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త ఉద్యోగాలు పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇలాంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి మాత్రమే కాక, యువతకు కొత్త రంగాల్లో అవకాశాలు తెస్తాయని, చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరణ పెట్టుబడులు, యువత శిక్షణ, సాంకేతిక అభివృద్ధి వంటి రంగాల్లో కేంద్రీకృతమై పనిచేస్తోందని తెలిపారు