LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Iran Israel War: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్... డ్రోన్ల దాడి! 1700 మంది మృతి!

Iran Israel War: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న భారీ వైమానిక దాడుల వల్ల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. టెహరాన్‌లో పేలుళ్లు, చమురు కేంద్రాల ధ్వంసం వల్ల కురుస్తున్న ఆమ్ల వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇరు పక్షాల దాడుల్లో ఇప్పటికీ 1700 మంది మరణించారు.

AndhraPravasi News Desk 1 min read
Iran Israel War: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్... డ్రోన్ల దాడి! 1700 మంది మృతి!

ఇరాన్‌లో నల్లటి ఆమ్ల వర్షం.. చమురు కేంద్రాలపై వైమానిక దాడుల ప్రభావం...

దుబాయ్‌పై డ్రోన్ల దాడి.. అడ్డుకుంటున్న రక్షణ వ్యవస్థలు, గల్ఫ్ దేశాల్లో టెన్షన్…

హార్మోజ్ జలసంధిలో అమెరికా విధ్వంసం: ఇరాన్ మైండ్ లేయర్ల ధ్వంసం…

Iran Israel War:  పశ్చిమాసియాలో యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు భారీ వైమానిక దాడులు (Air Strikes) జరుపుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్ పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించడంతో సుమారు లక్ష మంది జనం నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. దుబాయ్‌లోని పలు భవనాలపైకి దూసుకొస్తున్న డ్రోన్లను అక్కడి రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఈ ఘోర యుద్ధంలో 1700 మంది ప్రాణాలు కోల్పోయారు.

చమురు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్‌లో 'బ్లాక్ రెయిన్' (నల్లటి ఆమ్ల వర్షం) కురుస్తోంది. ఇది అక్కడి ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది. హార్మోజ్ జలసంధి సమీపంలో అమెరికా తన భీకర దాడులను కొనసాగిస్తూ ఇరాన్ మైండ్ లేయర్లను ధ్వంసం చేసింది. ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూ అమెరికా దౌత్య మద్దతు కేంద్రాలపై డ్రోన్ దాడులు చేస్తోంది. పలు నగరాల్లో సైరన్ల మోతతో భయానక వాతావరణం నెలకొంది.

ఈ యుద్ధ తీవ్రతను చైనా అంతరిక్షం నుండి నిశితంగా గమనిస్తోంది. ఇరాన్‌పై దాడులు మరిన్ని రోజులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలపై మరియు ప్రపంచ శాంతిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరు పక్షాలు పట్టు వీడకపోవడంతో ప్రాణ నష్టం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…