సినీ పరిశ్రమలో అల్లు కుటుంబంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా రంగప్రవేశం చేసిన అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. ఆయన రూపొందించిన చిత్రాలు కేవలం బాక్సాఫీస్ హిట్లు మాత్రమే కాకుండా, నూతన నిర్మాతలకు కూడా మార్గదర్శకంగా నిలిచాయి. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లింది ఆయన కుమారుడు అల్లు అర్జున్ తన నటన శైలితో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అర్జున్ పుష్ప తో దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపారు.
పుష్ప 2 విడుదల తర్వాత అల్లు అర్జున్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయనకు ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ అందుతోంది. అయితే, ఈ స్టార్ ఇమేజ్ ఏర్పడే దారిలో అల్లు అరవింద్ ఒక పెద్ద నష్టాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించారు.
అది వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బద్రీనాథ్ సినిమా సమయంలో మొదట చిన్న బడ్జెట్‌తో ప్రారంభమైన మెల్లగా ఈ ప్రాజెక్ట్ ఖర్చులు క్రమంగా పెరుగుతూ వెళ్లాయి. అప్పటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ మార్కెట్ ఆ స్థాయిలో లేకపోవడంతో ఆర్థికపరంగా ప్రమాదమని అల్లు అరవింద్ భావించినా బన్నీ ఉత్సాహంతో సినిమా పూర్తి చేశారు.
కానీ విడుదల తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో నిలవలేదు. భారీగా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, సుమారు రూ.40 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అల్లు అరవింద్ తెలిపారు. ఈ వెనుకడుగు ఆయనకు పెద్ద దెబ్బగా మారి కొంతకాలం పెద్ద సినిమాలపై రిస్క్ తీసుకోలేదని చెప్పారు.
కానీ ఇప్పుడు అల్లు అర్జున్ చూస్తే చాలా గర్వంగా ఉందని అప్పుడు తన నటనకి ఇప్పుడు తన నటనకి చాలా వ్యత్యాసం ఉందని కొన్ని కోట్ల ప్రేక్షకుల అభిమానాన్ని అల్లు అర్జున్ సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడని తన తండ్రి నిర్మాత అయిన నిర్మాత కొడుకు కాకుండా తన కష్టంతోనే నటనపై ఇష్టంగా మార్చుకొని జాతీయ అవార్డు ని కూడా పొందడం అది కూడా ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమల ఎవరికి రాని అరుదైన గౌరవం అర్జునుడికి దక్కిందని తెలిపారు.
అయితే ఆ అనుభవం తనకు మంచి పాఠం నేర్పిందని కూడా ఆయన పేర్కొన్నారు. సినిమా నిర్మాణంలో ప్రతి తప్పిదం ఒక పాఠమేనని, అది భవిష్యత్తులో జాగ్రత్తగా ముందుకు నడిపించడంలో సహాయపడుతుందని చెప్పారు. ఆ తరువాత గీత ఆర్ట్స్ మరోసారి పుంజుకుని సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిందని, ఇప్పుడు అల్లు కుటుంబం టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన సినీ కుటుంబాల్లో ఒకటిగా నిలిచిందని ఆయన గర్వంగా చెప్పారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తన 22వ సినిమా (AA 22) కోసం దర్శకుడు అట్లీతో కలిసి చేస్తున్నారు. దీపికా పదుకోణే హీరోయిన్‌గా నటిస్తున్నారు. బన్నీ ఈ సినిమాలో తాత, తండ్రి, ఇద్దరు కుమారులు అని మూడు తరాల పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా పునర్జన్మల కాన్సెప్ట్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉంటుందని, హాలీవుడ్ VFX కంపెనీ కూడా పనిచేస్తోంది. మొత్తం ఐదుగురు హీరోయిన్‌లు ఉంటారని చెప్పుకుంటున్నారు.