TCS: టీసీఎస్‌లో రికార్డు స్థాయి ఉద్యోగాల కోత..! రీస్ట్రక్చరింగ్ పేరుతో వేల మందికి నో సర్వీస్..!

ఈ ఏడాది మార్చి నెల మొదలుకొని తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు జలమయమై  పంట పొలాలు నీటమునిగి నష్టం చవిచూశాయి. 

అందుకోసం ప్రయత్నిస్తున్న ట్రంప్...అది వరించేనా?

అయితే ఇంతలోనే మరో అల్పపీడనం రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం రేపటికి (అక్టోబర్‌ 11) బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే వారం మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు.

DSC: వారికి గుడ్ న్యూస్.. ఉపాధ్యాయ నియామకాలపై లోకేశ్ కీలక నిర్ణయం..! కొత్త డీఎస్సీ షెడ్యూల్ ఖరారు..!

ప్రస్తుతం దక్షిణ ఒడిశా నుండి కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి సుమారు 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో వాతావరణంలో తేమ మరింత పెరిగింది. దీంతో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు.

ప్రభుత్వం కీలక ప్రకటన! మద్యం ప్రియులకు పండగే పండగ!

అదే సమయంలో తెలంగాణ ఏపీ మీదుగా కొనసాగుతున్న ఈ ద్రోణికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. దీని కారణంగా వాతావరణ వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారవచ్చని అంచనా. ఒకసారి ఈ అల్పపీడనం బలపడితే, వచ్చే వారాంతం వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) అంచనా వేసింది. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ, ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాలు ఈ వర్షాలకు ప్రధాన కేంద్రాలుగా మారే అవకాశం ఉంది.

Earthquake: ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన భారీ భూకంపం..! పసిఫిక్ తీరాల్లో అలలు ఎగిసే ప్రమాదం..!

గత 24 గంటల్లో కూడా పలు ప్రాంతాలు భారీ వర్షాలకు జలమయం అయిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లిలో అత్యధికంగా 9.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కలపల్లి (7.55 సె.మీ), తిప్పర్తి (6.78 సె.మీ), కట్టంగూరు (5.07 సె.మీ), నార్కెట్‌పల్లి (4.76 సె.మీ), మహబూబ్‌నగర్ మూసాపేట (4.71 సె.మీ), భూత్పూర్ (4.59 సె.మీ) ప్రాంతాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది. 

ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త సర్వీస్… మహిళల కోసం ప్రత్యేక ప్లాన్!

ఈ క్రమంలో ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని  అవసరం లేకుండా బయటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. వచ్చే వారం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున  ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని ముందస్తు  సూచనలు ఇవ్వడం జరిగినది.

SEBI Officer Grade-A: ప్రతిష్టాత్మక ఫైనాన్షియల్ రిక్రూట్‌మెంట్ 2025! రూ.1,26,100 జీతంతో... మూడు దశలుగా!
Us Immigration: అమెరికాలో స్థిరపడాలనుకుంటున్నారా! అయితే.. ఈబీ5తో గ్రీన్‌కార్డు సులభం!
High Court: ఉత్కంఠ భరితంగా మారిన స్థానిక ఎన్నికలకు బ్రేక్! హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!
5G Android Phones: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! ఉచితంగా 5జీ ఆండ్రాయిడ్ మొబైల్స్.. త్వరపడండి!