18 ఏళ్ల అమెరికా ఆంధ్ర పిల్ల! పాసింజర్ విమానాల పైలెట్! ప్రశంసలతో ముంచేత్తిన చంద్రబాబు!

కడప జిల్లా గూడెం చెరువులో నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళా ఎమ్మెల్యేపై దూషణలు ఖండనీయమని, పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలని స్పష్టం చేశారు. నాయకుడు రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కడ ఆందోళన చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో ప్రతిచోట డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు.

Drumstick Benefits: మునగ ప్రయోజనాలు, ఉపయోగాలు.. ఈ బెనిఫిట్స్​ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! 21 వ్యాధులకు చెక్!

అభివృద్ధి ప్రాజెక్టులు – కడప స్టీల్‌ప్లాంట్, గండికోట పనులు ప్రారంభం
కడప స్టీల్‌ప్లాంట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, 2028 డిసెంబర్ నాటికి తొలిదశ పూర్తవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా జమ్మలమడుగు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గండికోట అభివృద్ధికి రూ.85 కోట్ల నిధులు కేటాయించి, శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. హంద్రీనీవా లైనింగ్ పనులు, చెరువుల మరమ్మతులు కూడా చేపట్టినట్టు వెల్లడించారు.

IBPS Bank Jobs: ఈ రోజు నుంచి IBPS క్లర్క్ అప్లికేషన్లు... అర్హతలు, వివరాలు ఇవే!

ప్రజా సంక్షేమం – రైతులకు, మహిళలకు సాయం
‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రేపటి నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ కానుందని, ఒక్కో రైతుకు కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.20 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అర్హులైన వితంతువులకు సాయం అందిస్తోన్నామని, దేశంలోనే అత్యధిక పింఛను ఇస్తున్న రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికెళ్లి మరీ పింఛన్లు అందిస్తున్నామని వివరించారు.

New Cars: మొదటిసారి కారు కొనాలనుకుంటున్నారా? ఈ 5 చవక కార్లు మిస్ కావొద్దు! మైలేజ్, స్టైల్, సేఫ్టీ - మీకోసం పూర్తి లిస్ట్!

నీటి వనరుల వినియోగం – కరవు నివారణ
సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటే కరవు సమస్య ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి నుంచి ఏటా 2 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని, వాటిని సక్రమంగా వాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చామని, భవిష్యత్తులో ఇతర ప్రాంతాలవారు రాయలసీమకు రావాల్సిన పరిస్థితి తేవడమే లక్ష్యమని తెలిపారు.

Onion Paratha: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. కరకరలాడే ఉల్లిపాయ పరాఠా! ఇలా ఈజీగా 10 నిllల్లో చేయండి..

మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్యుత్ రంగంలో ప్రగతి
ఒక్క ఏడాదిలోనే రూ.12 వేల కోట్లు రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేశామని, ఇప్పటికే గుంతలు పూడ్చినట్టు, మిగతా రోడ్లనూ బాగు చేస్తామని హామీ ఇచ్చారు. సౌర, పవన, పంప్డ్ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నామని వెల్లడించారు. కొప్పర్తి, ఓర్వకల్లు ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పడుతున్నాయని తెలిపారు.

Constable Results: AP పోలీస్ ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్.. వెంటనే వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి!

తెలుగు ప్రజల గౌరవం – ఐటీ పునాదుల ప్రస్తావన
భావితరాల కోసం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. తాను ఎంతో ముందుచూపుతో రాష్ట్రంలో ఐటీ రంగానికి పునాదులు వేశానని, దాని ఫలితంగా నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ప్రతిభను చాటుకుంటున్నారని చెప్పారు. సింగపూర్‌లోనే 40 మంది తెలుగువారు ఉన్నారని, అనేక దేశాల్లో తెలుగువారి తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Ramanaidu Comments: జగన్ అంతటి ఘనుడు.. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్! ఇది కేవలం మొదటిపడుగే.!

కడపలో టీడీపీ బలం – వచ్చే సారి పది సీట్లు లక్ష్యం
గత ఎన్నికల్లో కడపలో పదికి ఏడు సీట్లు గెలిచామని, వచ్చే సారి పదికి పది సీట్లు గెలవడమే లక్ష్యమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జమ్మలమడుగు తమ పార్టీకి కంచుకోట అని, అనేక కార్యక్రమాల్లో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Rains Alert: ఈ నెల 7 వరకు వర్షాలు కొనసాగొచ్చు... TG APలో అధికారులు అప్రమత్తం!
Schengen Visa: స్కెంజెన్ వీసాల కష్టాలు.. జర్మనీ కొత్త నియమాలు - భారతీయులకు చిక్కులు! పర్యాటకుల కష్టాలు రెట్టింపు....
World News: రైలు, విమానం ఒకే రన్‌వేపై.. ప్రపంచంలో ఏకైక రన్‌వే! అదెక్కడో తెలుసా..?