ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వంటకాలలో ఉల్లిపాయ పరాఠా ఒకటి. కారంగా, కరకరలాడే రుచితో ఉండే ఈ వంటకం అల్పాహారానికి గానీ, తేలికపాటి భోజనానికి గానీ సరైన ఎంపిక. పెరుగు, పచ్చడి లేదా వెన్నతో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది.
తయారీకి కావలసిన పదార్థాలు..
పిండికి: గోధుమ పిండి – 2 కప్పులు, ఉప్పు – తగినం, తనీరు – అవసరమైనంత, నూనె – 1 టీ స్పూన్
స్టఫ్ఫింగ్ కి: సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు, కారం పొడి – ½ టీ స్పూన్, వాము (అజ్వైన్) – ½ టీ స్పూన్, ఉప్పు – తగినంత
తయారీ విధానం…
గోధుమ పిండి, ఉప్పు, నీరు వేసి మృదువైన పిండిని కలిపి, చివరగా నూనె వేసి మళ్ళీ కలిపి 15–20 నిమిషాలు కలిపి పక్కన పెట్టాలి.
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, వాము, ఉప్పు వేసి కలపాలి. (నీళ్లు కారకుండా పూర్ణం చేయాల్సిన సమయానికి కలపాలి.)
పిండితో ఒక ముద్ద తీసుకుని చపాతీలా బెల్లాలి. మధ్యలో ఉల్లిపాయ మిశ్రమం పెట్టి అంచులు మూసి, మెల్లగా పరాఠాగా వత్తాలి.
వేడి తవ్వా మీద రెండు వైపులా నూనె లేదా నెయ్యి రాసుకుంటూ బంగారు రంగులోకి మారే వరకు వేపాలి.
వేడిగా పెరుగు, పచ్చడి లేదా వెన్నతో వడ్డించాలి.
ఉల్లిపాయ పరాఠా రుచితో పాటు కడుపునిండా తృప్తినిచ్చే వంటకం. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాబట్టి, ఒకసారి తప్పక ప్రయత్నించండి.