'నాటకం', 'తీస్ మార్ ఖాన్' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌ల సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న కళ్యాణ్ జీ గోగణ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఆయన తన తదుపరి చిత్రం 'మారియో' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి సినిమా అభిమానులను ఆకట్టుకున్నారు.
ఈ రోజు విడుదలైన ఈ పోస్టర్.. 'ఎ టర్బో చార్జ్ ర్యాంప్ రైడ్' అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమా యాక్షన్-ప్యాక్డ్, స్టైలిష్ మరియు రొమాంటిక్ వైబ్స్‌తో నిండి ఉంటుందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అవుతోంది. దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
'మారియో' ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమా కథాంశంపై, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీపై ఒక క్లారిటీ ఇస్తోంది. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్గా ఉంది.
హీరో అనిరుధ్ ఒక చేతిలో రైఫిల్ పట్టుకుని ఉన్న తీరు, అతని ఇంటెన్స్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌కు కొదవ ఉండదని తెలుస్తోంది. అతని పోజు చాలా ధైర్యంగా, దూకుడుగా ఉంది.
హీరోయిన్ హెబ్బా పటేల్ ఎరుపు రంగు డ్రెస్సులో చాలా డైనమిక్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌లో ఏదో గందరగోళం, ఉద్వేగం కనిపిస్తున్నాయి. అనిరుధ్, హెబ్బా పటేల్ ఇద్దరూ పోస్టర్‌లో పెట్టిన పోజు చూస్తుంటే వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎంత హాట్గా ఉంటుందో అర్థం అవుతుంది. ఈ జోడీ తెరపై ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ పోస్టర్‌లో బ్యాక్‌డ్రాప్‌ను గమనిస్తే.. క్లాసిక్ కారు, చీకటి, వర్షం వంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా సినిమాకు ఒక థ్రిల్లర్ థీమ్‌ను సూచిస్తుంది. 'మారియో' కేవలం రొమాంటిక్ సినిమా మాత్రమే కాదు, గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా కూడా ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ పోస్టర్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో విషయం ఏమిటంటే.. హీరోయిన్ హెబ్బా పటేల్ లుక్. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కాస్త బొద్దుగా కనిపించిన హెబ్బా, ఈ పోస్టర్‌లో మాత్రం మళ్లీ బక్కచిక్కి, స్లిమ్‌గా కనిపించడం గమనార్హం. 'మారియో' సినిమా కోసం ఆమె తన లుక్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, మేకోవర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాపై ఆమె ఎంత శ్రద్ధ పెట్టారో ఈ మార్పు తెలియజేస్తుంది.
'మారియో' చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తుండగా, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి బలమైన సాంకేతిక నిపుణుల బలం ఉంది.
సంగీతం: మెలోడీ మాంత్రికులు సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు పెద్ద బలం కానుంది.
రాకేందు మౌళి పాటలు, మాటలు రాయడంతో పాటు సంగీత విభాగంలో కూడా తన సహాయాన్ని అందించనున్నారు.
కెమెరా, ఎడిటింగ్: MN రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మణికాంత్, మదీ మన్నెపల్లి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా పూర్తి స్థాయి నిర్మాణంలో ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అంచనాలను పెంచేసిన 'మారియో'.. థియేటర్లలో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో చూడాలి. దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ నుంచి వస్తున్న ఈ కొత్త సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.