హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురికి నోటీసులు జారీ చేసి, విచారణ కోసం పిలిచారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూఎన్సర్లు, బుల్లితెర నటీనటులు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడంతో వారిపై కేసులు నమోదయ్యాయి. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ "సే నో టూ బెట్టింగ్ యాప్స్" ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత, ఈ వ్యవహారంపై పోలీసుల దృష్టి మరింత కేంద్రీకృతమైంది. ఇప్పటివరకు 11 మంది ప్రముఖులపై కేసులు నమోదు కాగా, వారిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భారీ షాక్! కీలక నేత అరెస్ట్.. అసలు ఏమైందంటే..?
ఈ కేసులో ఇప్పటికే విష్ణు ప్రియ, టేస్టీ తేజా వంటి ఇన్‌ఫ్ల్యూఎన్సర్లకు నోటీసులు అందగా, టేస్టీ తేజా మంగళవారం విచారణకు హాజరై తన ప్రమోషన్ వ్యవహారంపై సమాధానమిచ్చాడు. తాజా సమాచారం మేరకు, నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిని గురువారం విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ఇప్పటికే దుబాయ్‌కి పారిపోయారు.
ఇక, ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కోణం ఉన్నట్లు అనుమానించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జోక్యం చేసుకుంది. దీంతో, ఈ వ్యవహారం మరింత తీవ్రమవుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో ప్రమేయం ఉన్న వారిలో కొందరు అరెస్టు భయంతో తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తూ, కీలక ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, ఇంకా అనేక మంది సెలబ్రిటీలపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్! ఆధార్ ఫింగర్ సమస్యకు పరిష్కారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
తిరుమలలో భక్తుల వసతి కష్టాలకు చెక్! శిథిల భవనాల తొలగింపు.. టీటీడీ కార్యాచరణతో కీలక మార్పులు!
మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!
నేటితో గొడ్డలి వేటుకు 6 ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!
రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!
గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్ రంగం... అసలు నిజాలు బయటకు!
బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!
మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!
ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!
తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!
ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: