ఏపీలో పింఛన్ దారులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్నేళ్లుగా వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలకు చెక్ పెట్టేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆధార్ ప్రాధికార సంస్ధ ఉడాయ్ తాజాగా సాఫ్ట్ వేర్ మార్చడంతో అందుకు అనుగుణంగా లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్ లబ్దిదారులకు దీర్ఘకాలంగా ఉన్న ఓ సమస్య తీరబోతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇలా పెన్షన్లు తీసుకునే సమయంలో వృద్ధులైన లబ్దిదారులు తమ వేలి ముద్రల్ని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా స్కానర్లపై వీరి వేలి ముద్రలు తీసుకుని పెన్షన్లు ఇస్తున్నారు. అయితే వృద్ధాప్యం కారణంగా అరిగిపోయిన వేలి ముద్రలు స్కానర్లపై పడటం లేదు. దీంతో వారికి పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపుతోంది.
ఇది కూడా చదవండి: కార్యకర్త హఠాన్మరణంపై పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం.. ఎలా చనిపోయారనే విషయంలో..
పింఛన్ల పంపిణీ చేసే సమయంలో వాడేందుకు వీలుగా ఈ నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇచ్చేటప్పుడు లబ్దిదారుల వేలిముద్రలను ఈ పరికరం సహాయంతో తీసుకుంటారు. అయితే ఆధార్ సాఫ్ట్ వేర్ ను ఉడాయ్ సంస్థ అప్ డేట్ చేయంతో గతంలో ఉన్న పాత పరికరాలు పనికి రాకుండా పోయాయి. దీంతో ప్రభుత్వం ఉడాయ్ అప్ డేట్ చేసిన సాఫ్ట్ వేర్ పనిచేసే విధంగా కొత్త స్కానర్లను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు మొత్తం 1,34,450 స్కానర్లను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. సచివాలయాల వారీగా ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన స్కానర్లు కావడంతో ఫింగర్ ప్రింట్ సరిగా పడక సిబ్బంది, లబ్దిదారులు ఇన్నాళ్లూ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నూతన పరికరాల సాయంతో ఈ సమస్యలకు చెక్ పెట్టబోతున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!
నేటితో గొడ్డలి వేటుకు 6 ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!
రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!
గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్ రంగం... అసలు నిజాలు బయటకు!
బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!
మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!
ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!
తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!
ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: