సరికొత్తగా రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య పెరుగుతోంది. సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు తాత్కాలికంగా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ. 720 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మేరకు మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు (17405) ఈ నెల 26 నుంచి చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. రాత్రి 8.10 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌లో బయలుదేరి 9.14కు బొల్లారం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఆదిలాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17406) ఉదయం 4.29 గంటలకు బొల్లారం, 5.45 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. కాకినాడ-లింగపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07446) ఏప్రిల్ 2 నుంచి జులై 1 వరకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 9.15 గంటలకు గమ్యస్థానమైన లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07445) సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయల్దేరి 7.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. కాజీపేట నుంచి నడిచే హదాప్పర్ ఎక్స్‌ప్రెస్ (17014) రైలు రాత్రి 8.20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17013) తెల్లవారుజామున 3 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఏప్రిల్ 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అలాగే, లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 25 నుంచి చర్లపల్లి కేంద్రంగా నడుస్తుంది. ఉదయం 7.15 గంటలకు రైలు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి చేరుకుటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..
హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!
ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!
బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!
ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!
వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?
ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!
జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: