హోలీ పండుగ రోజు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై దుండగులు కాల్పులు జరపడం కలకలాన్ని రేపింది. నలుగురు దుండగులు గన్స్‌తో ఇంట్లోకి చొరపడి 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే .. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు సెక్యురిటీ అధికారి కూడా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్ గాయం అయినట్లు సమాచారం. అయితే ఈ దాడి ఎవరు చేశారు? అనేది తెలియరాలేదు. దుండగుల కాల్పుల్లో గాయపడిన ఠాకూర్‌ను తొలుత సురక్షిత ప్రాంతానికి తరలించి, ఆయన పీఎస్ఓ ను నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఠాకూర్‌ను కూడా ఆసుపత్రిలో చేర్పించారు. బిలాస్‌పుర్ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ బిలాస్‌పుర్ ఎయిమ్స్‌కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు దుండగులు ఆయుధాలతో అకస్మాత్తుగా కాల్పులు జరుపుతూ ఇంట్లోకి ప్రవేశించడం సీసీ టీవీ పుటేజీలో కనిపించింది. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం అయింది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నేటితో గొడ్డలి వేటుకు 6 ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!
రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!
గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్ రంగం... అసలు నిజాలు బయటకు!
బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!
మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!
ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!
తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!
ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: