ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ హాస్పిటాలిటీ రంగంలో దూసుకుపోతున్న ఓయో 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ నిర్వహించే హోటళ్ల విస్తరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 1,300కి పైగా స్వయంగా నిర్వహించే హోటళ్లు ఉన్నాయి. వీటిని FY26 నాటికి 1,800కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం (FY25)లో ఈ సంఖ్య సుమారు 900 హోటళ్లుగా ఉంది. ఓయో కంపెనీ నిర్వహించే హోటళ్ల నుంచి వచ్చే బుకింగ్ ఆదాయాన్ని 22 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని భావిస్తోంది. ఇది కంపెనీ మొత్త ఆదాయంలో భారీ వృద్ధికి దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఓయో కంపెనీ నడుపుతున్న హోటళ్లు 124 నగరాల్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: అమరావతిని దెబ్బతీసేందుకు జగన్, భారతి కుట్ర! ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే..
FY26 నాటికి ఈ హోటళ్లను 300కి పైగా నగరాల్లో విస్తరించాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా మొహాలీ, ఫరిదాబాద్, జలంధర్, కటక్, ఆసన్సోల్, దార్జిలింగ్, మంగళూరు, కొల్లం, పోర్ట్ బ్లెయిర్, కాసరగోడ్, భిల్వారా, వాపి, జూనాగఢ్, జల్గావ్ నగరాల్లో విస్తరించనున్నారు. ఇతర హోటల్స్‌తో పోల్చితే ఓయో స్వయంగా నడిపిస్తున్న వాటిలో రేటింగ్స్ అధికంగా ఉంటున్నాయి. గెస్టుల రేటింగ్: సగటున 4.6 (ఇతర హోటళ్ల సగటు 4.0)గా ఉంది. అలాగే ఆక్యుపెన్సీ రేటు 2.7 రెట్లు ఎక్కువ ఉండగా, రిపీట్ కస్టమర్ రేటు 1.3 రెట్లు ఎక్కువ ఉంటోంది. ఇందులో భాగంగానే ఓయో స్వయంగా నడిపించే హోటల్స్ సంఖ్యను పెంచే దిశగా దృష్టి సారించింది. ఓయో ప్రధానంగా లీజర్ సిటీస్, పుణ్యక్షేత్రాలు, వ్యాపార ప్రాంతాలపై దృష్టి పెడుతోంది. అక్కడ హోటల్ అవసరాలు ఎక్కువగా ఉండటంతో, అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ఇలా ఓయో రానున్న రోజుల్లో తన సొంత హోటల్స్‌ను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. కాగా ఓయో త్వరలోనే ఐపీఓకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: