LIVE
Tirupati: తిరుపతిలో హిందూ సంఘాల ఐక్యతా యాత్ర.. ధర్మ పరిరక్షణకు పిలుపు!  •  Machilipatnam: మచిలీపట్నం అభివృద్ధికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సహకారం!  •  Chandrababu: ఉపాధి హామీ నిధులను పూర్తిగా వినియోగించాలి.. జలధారపై సీఎం సమీక్ష!  •  Amaravathi: అమరావతి అభివృద్ధి కోసం భూముల సమీకరణ వేగవంతం చేయాలి.. మంత్రి నారాయణ!  •  Assam: అస్సాంలో యుద్ధ విమానం ప్రమాదం.. ఐదుగురు వాయుసేన సిబ్బంది మృతి!  •  Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
Entertainment

Boyapati upcoming Movie: బోయపాటి నెక్స్ట్ సినిమా ఆ పాన్ ఇండియా విలన్‌తో.. ఇక థియేటర్లలో పూనకాలే!

Boyapati Srinu Next Movie: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తదుపరి భారీ చిత్రాన్ని దగ్గుబాటి రానాతో ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2' వంటి భారీ విజయం తర్వాత వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

AndhraPravasi News Desk 2 min read
Boyapati upcoming Movie: బోయపాటి నెక్స్ట్ సినిమా ఆ పాన్ ఇండియా విలన్‌తో.. ఇక థియేటర్లలో పూనకాలే!

Boyapati upcoming Movie:  గతేడాది 'అఖండ 2' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టించారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. నందమూరి బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, బోయపాటి మార్క్ ఎలివేషన్లతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో కూడా ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ రావడంతో, బోయపాటి తన తర్వాతి ప్రాజెక్ట్‌ను అంతకు మించిన స్థాయిలో ప్లాన్  చేయనున్నారని సమాచారం. ఈ క్రమంలో ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే ఉత్కంఠకు ఇప్పుడు తెరపడబోతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని దగ్గుబాటి రానాతో పట్టాలెక్కించబోతున్నారు అని సినీ వర్గాలలో చర్చ నడుస్తుంది. ఇటీవల వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయని, రానా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 'బాహుబలి' సినిమాలో భల్లాలదేవగా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రానా, బోయపాటి స్టైల్ ఊర మాస్ యాక్షన్ సినిమాలో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రానా కటౌట్‌కు, బోయపాటి ఇచ్చే మాస్ ఎలివేషన్లు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సినిమా కేవలం తెలుగుకే పరిమితం కాకుండా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. రానాకు ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది, అలాగే 'అఖండ 2' తర్వాత బోయపాటి పేరు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ వ్యాపారపరంగా కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని, ఇందులో రానా క్యారెక్టరైజేషన్ గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం.

చాలా కాలంగా రానా సోలో హీరోగా వెండితెరపై కనిపించి అభిమానులను అలరించలేదు. వెబ్ సిరీస్‌లు, ఇతర భాషా చిత్రాల్లో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు ఒక భారీ యాక్షన్ సినిమాతో తన స్టామినాను నిరూపించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు బోయపాటి కూడా తన సక్సెస్ గ్రాఫ్‌ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే అది కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ క్రేజీ కాంబో గురించి వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా ప్రకటించనుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆఖరిలో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

Be the first to react

More Coverage

Renu Desai: కథ, టైటిల్ అన్నీ సస్పెన్స్.. రేణు దేశాయ్ కొత్త ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో పెరిగిన అంచనాలు!

Renu Desai: కథ, టైటిల్ అన్నీ సస్పెన్స్.. రేణు దేశాయ్ కొత్త ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో పెరిగిన అంచనాలు!

Renu Desai: సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రేణు దేశాయ్…

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…