Vijay Deverakonda: విద్యారంగానికి విజయ్ భరోసా.. 44 స్కూళ్లలో స్కాలర్షిప్లు - కీలక నిర్ణయం..
Vijay Deverakonda Announces Scholarshipd: కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సొంతూరులో సందడి చేశారు. వివాహానంతరం సతీమణి రష్మిక (Rashmika) మందన్నతో స్వగ్రామానికి తిరిగొచ్చారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని తుమ్మన్ ్పటకు చెందిన దేవరకొండ మాధవి, గోవర్ధన్రావుల మొదట…
- విజయ్ దేవరకొండ పెద్ద మనసు: టెన్త్ క్లాస్ టాపర్లకు స్కాలర్‌షిప్స్ ప్రకటన..
- సతీమణి రష్మికతో కలిసి స్వగ్రామం తుమ్మన్‌పేటకు విజయ్ దేవరకొండ!
Vijay Deverakonda Announces Scholarshipd: కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సొంతూరులో సందడి చేశారు. వివాహానంతరం సతీమణి రష్మిక (Rashmika) మందన్నతో స్వగ్రామానికి తిరిగొచ్చారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని తుమ్మన్ ్పటకు చెందిన దేవరకొండ మాధవి, గోవర్ధన్రావుల మొదటి సంతానం విజయ్ దేవరకొండకు గత నెల 26న వివాహమైన సంగతి తెలిసిందే. ఇటీవల స్వగ్రామంలో నూతన ఫాంహౌజ్ నిర్మాణం పూర్తికావడంతో సోమవారం కొత్త దంపతులకు డప్పులు, కోలాటంతో ఘనస్వాగతం పలికారు. భక్తిశ్రద్ధలతో గృహ ప్రవేశ పూజలు నిర్వహించారు. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు.
స్వగ్రామం తుమ్మన్పేట నుంచి 32 ఏళ్ల కిందట వెళ్లినప్పటికీ తమ కుటుంబానికి గ్రామస్థులతో విడదీయరాని అనుబంధం ఉందని నటుడు విజయ్ దేవరకొండ తెలిపారు. స్వగ్రామంలో తొలి పుట్టినరోజు వేడుక నిర్వహించినట్లు అమ్మా నాన్న చెప్పారని ఆయన తెలిపారు. తన తండ్రి కోరిక మేరకు స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకున్నామని, వివాహానంతరం వ్రతం చేసి గ్రామస్థులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ విద్యా సంవత్సరం తుమ్మన్పేట ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు ఉపకారవేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం అచ్చంపేట డివిజన్ పరిధిలో 44 పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తానన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా దేవరకొండ విజయ్ పంచెకట్టు, రష్మిక మందన్న చీరకట్టు అందర్నీ ఆకట్టుకున్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయిన తర్వాత గ్రామస్థులు, అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనశాల వద్దకెళ్లి వారు సందడి చేశారు. రష్మిక మందన్న అభిమానులకు అభివాదం చేస్తూ సంతోషంగా గడిపారు. కుటుంబ సభ్యులు, నూతన దంపతుల ఆహ్వానం మేరకు నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోశ్, ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ రాములు, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, నాగం శశిధర్రెడ్డి, స్థానిక రాజకీయ పార్టీల నాయకులు తుమ్మన్పేటకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Be the first to react