పల్నాడు (palnadu) జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) గ్రామీణ పోలీసు స్టేషన్లో వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పై తాజాగా కేసు నమోదు చేయడంతో కలకలం రేగింది. ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan) రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీగా జనసమీకరణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో పోలీసులు అంబటికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 41A కింద నోటీసులు (Notce) జారీ చేశారు. ఆయనను జూలై 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఇదే తరహాలో పలువురు వైకాపా నేతలపై కేసులు నమోదు కావడం, విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపడం తెలిసిందే.
గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైన నేపథ్యంలో, తాజా కేసు ఆయనకు మరొక అనుభవంగా మారింది. అధికారంలో లేకున్నా, నియంత్రణలో ఉండాల్సిన బాధ్యత విస్మరించారని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫిర్యాదుల మేరకు విచారణ జరుగుతుందని వారు తెలిపారు.