శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల
నుంచి శ్రీశైలానికి 1,56,516 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 87,525
క్యూసెక్కులు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్
కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,210 క్యూసెక్కుల నీటిని
విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50
అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం
201.58 టీఎంసీలు (TMCs)గా కొనసాగుతోంది.