ఆటోడ్రైవర్లకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ద్వారా తమ ఉపాధికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆటోడ్రైవర్ల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్న ఆగస్ట్ 15న.. ఆటోడ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: New Muncipalities: రాష్ట్రంలో కొత్తగా రెండు మున్సిపాలిటీలు.. మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్! ఆ గ్రామాలకు మహర్దశ


సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ అమలు కోసం సీఎం చంద్రబాబు కసరత్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించింది.

మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులోనూ పర్యటించి అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించింది. అన్ని అంశాలపై కసరత్తు చేసిన తర్వాత ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: Employement News: డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు! ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే!


మరోవైపు తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఉచిత బస్సు కారణంగా తమ ఉపాధి దెబ్బతిందని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. ఆటో తోలుతూ నాలుగు రాళ్లు వెనకేసుకునే తమకు.. ఉచిత బస్సు కారణంగా గిరాకీలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: New International Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. తొలిసారి విమానం గాల్లో చక్కర్లు! ఫుల్ జోష్...!


ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో.. ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణ మాదిరిగా రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం అమలుచేస్తుందా.. జిల్లాలకే పరిమితం చేస్తుందా చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Tunnel works: సొరంగ మార్గానికి రూ.920 కోట్లు! ఇక దూసుకెళ్లిపోవచ్చు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

 Airport Luggage Missing: ఎయిర్‌పోర్టులో లగేజీ పోయిందా? వెంటనే ఇలా చేయండి!

Clarity about Transfers: ఏపీ సచివాలయ ఉద్యోగులకు నో టెన్షన్! బదిలీల్లో అవి వర్తించవు!

 Sarkar Decision: ఏపీ సర్కారు షాకింగ్ డెసిషన్! నేడు కీలక భేటీ!

South India Tour: ఒకే ట్రిప్​లో "పద్మనాభ స్వామి టూ మదురై మీనాక్షి"! ప్యాకేజీలు ఇవే!

TTD Scan Process: టీటీడీ కీలక నిర్ణయం! జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు.. క్యూలైన్లో నిలబడక్కర్లేదు!

Ration Cutting: రేషన్‌కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?

Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!

AP Inner Ring Road: ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడేమారనున్న రూపురేఖలు! వారి కళ్ళల్లో ఆనందం..

Praja Vedika: నేడు (24/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group