ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 538 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెబుతున్నారు. చివరి తేదీగా అక్టోబర్ 3, 2025 ని నిర్ణయించినట్లు సమాచారం.
విద్యార్హతలు
ఈ ఉద్యోగాలకు ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలని అధికారులు తెలిపారు అలాగే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC)లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలని చెబుతున్నారు. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి అదనపు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలపడం జరిగినది.
వయస్సు పరిమితి
OC అభ్యర్థులు గరిష్టంగా 42 సంవత్సరాలు
EWS, SC, ST, BC అభ్యర్థులు గరిష్టంగా 47 సంవత్సరాలు
PH/Ex-Servicemen అభ్యర్థులు గరిష్టంగా 50–52 సంవత్సరాలు వరకు అనుమతిస్తామని అధికార వర్గాలు తెలుపుతున్నారు.
వేతనం
ఎంపికైన వారికి మంచి వేతనం ఇవ్వనున్నట్లు సమాచారం.
కనిష్ట వేతనం: రూ. 61,960
గరిష్ట వేతనం: రూ. 1,51,370
ఎంపిక విధానం
ఈ నియామకాలలో ఇంటర్వ్యూ లేదా వ్రాత పరీక్ష ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు. సమర్పించిన సర్టిఫికేట్లను పరిశీలించి తుది ఎంపిక జాబితా వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
దరఖాస్తు వివరాలు
దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.
ప్రారంభం సెప్టెంబర్ 11, 2025
చివరి తేదీ అక్టోబర్ 3, 2025
ఫీజు OC – రూ.1000, BC/SC/ST/EWS – రూ.750
దరఖాస్తు విధానం గురించి అధికారులు వివరించారు
అధికారిక వెబ్‌సైట్ (https://apmsrb.ap.gov.in/msrb/)లోకి వెళ్లి "Recruitment 2025" లింక్‌పై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఆన్‌లైన్ ఫారమ్ పూరించి, ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. ఒకసారి సబ్మిట్ చేసిన దరఖాస్తులో మార్పులు చేయలేమని కూడా తెలియజేయడం జరిగినది.
వైద్య రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం అని ముఖ్యంగా ఈ నియామకాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతున్నందున, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.