భారతదేశంలో మెసేజింగ్ యాప్‌ల పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ పోటీలోకి తాజాగా చెన్నై కేంద్రంగా ఉన్న జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన అరట్టై (Arattai) యాప్ అడుగుపెట్టింది. తమిళంలో అరట్టై అంటే సాధారణ సంభాషణ అని అర్థం. రోజువారీ మెసేజింగ్ అవసరాలను మరింత సులభం, సురక్షితం చేయడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం.
ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యాప్‌ను వాట్సాప్‌కు భారతీయ ప్రత్యామ్నాయంగా అభివర్ణించారు. ట్విట్టర్ వేదికగా ఆయన, అరట్టై ఉచితం, సులభం, సురక్షితం. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి అంటూ ప్రజలను ఆహ్వానించారు. అంతేకాక, ఐటీ , రైల్వేల మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహో ఉత్పత్తులను ప్రశంసిస్తూ, ఇటీవల కేబినెట్ సమావేశంలో మైక్రోసాఫ్ట్ పవర్‌పాయింట్ బదులుగా జోహో షో వాడినట్లు వెల్లడించారు. ప్రభుత్వ మద్దతు ఈ యాప్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
అరట్టై ఇంట్రెస్టింగ్ ఫీచర్లు
ఫైల్ & మీడియా షేరింగ్ – ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపే సౌకర్యం అదేవిధంగా టెక్స్ట్ మెసేజింగ్ – వ్యక్తిగతంగా లేదా గ్రూప్‌లలో చాట్ చేసే అవకాశం ఉంటుందట.స్టోరీస్ – రోజువారీ అప్‌డేట్స్ పంచుకునే ఫీచర్.చానెల్స్ & బ్రాడ్‌కాస్ట్ – వ్యాపార అవసరాలకు ప్రేక్షకులతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం.
ఈ విధంగా, అరట్టై వ్యక్తిగత కమ్యూనికేషన్‌కి మాత్రమే కాకుండా, బిజినెస్ అవసరాలకు కూడా ఉపయోగపడుతోంది అని తెలిపారు.
భద్రత విషయంలో అరట్టై కొన్ని ప్రత్యేకతలు కలిగిఉన్నా, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేవలం వాయిస్, వీడియో కాల్స్‌కే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందుబాటులో ఉంది. కానీ టెక్స్ట్ మెసేజింగ్ మాత్రం పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కాలేదు. ఇది వాట్సాప్‌తో పోలిస్తే చాల పెద్ద తేడా. వాట్సాప్‌లో కాల్స్, మెసేజ్‌లు రెండూ ఎన్‌క్రిప్షన్‌తో భద్రపరిచబడుతుంటే, అరట్టైలో ఈ ఫీచర్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులు దీన్ని కొంత ఆందోళనగా భావించే అవకాశం ఉందని అంటున్నారు.