India Pakistan: భారత్ పాక్ ఆసియా కప్ ఫైనల్ హైటెన్షన్.. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. 2023-24 మరియు 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం రూ.400 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు అందించడానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను శనివారం జారీ  చేయడం జరిగినది.

ఏపీ ప్రజలకు శుభవార్త...కొత్త ఇళ్ల పథకంలో కీలక మార్పులు!

ఈ నిధుల్లో భాగంగా, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ అవుతాయి. దీనివల్ల కాలేజీలు స్వయంగా ఈ మొత్తాన్ని తీసుకుని విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించినట్లు అవుతుంది.అయితే, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆ సంవత్సరానికి కొన్ని కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేశాయని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. అందువల్ల, ఆ సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలు ఎక్కువగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోనే జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tourist: విజయవాడ పర్యాటక రంగానికి నూతన శకం..! ఆ కొండపై లిఫ్ట్ సౌకర్యం!

గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోనే జమ అయ్యేవి, ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ మొత్తాన్ని కాలేజీలకు చెల్లించేవారు. ఆ సమయంలో విద్యార్థి మరియు తల్లి జాయింట్ అకౌంట్ తెరిచి, ఆ ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే విధానం అమలులో ఉండేది.

Hair Care Tips: ఇన్‌స్టాంట్ అందం కోసం.. జుట్టు ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి! దానిని అతిగా వాడితే.!


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానంలో మార్పులు చేసింది. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా మరియు నిధుల విడుదలలో జాప్యం జరగకుండా ఉండేందుకు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు సులభంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రయోజనాన్ని పొందగలరు అని అధికారులు తెలిపారు.

Obama: వృద్ధ నేతల అధికారం మోజే ప్రపంచ సమస్యలకు మూలం..! బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు!
అక్టోబర్‌లో బ్యాంక్ సెలవులు – వినియోగదారులు అలర్ట్!
Modi shares: దుర్గానవరాత్రి సందర్భంగా తెలుగు పాటను షేర్ చేసిన మోదీ.. సోషల్ మీడియాలో హంగామా!
సాయిపల్లవి స్టైల్ అంటే ఇదే.. విమర్శకులకు దీటుగా పోస్ట్.. అభిమానుల హర్షం!
QR payment Kiwi : చిన్న చెల్లింపులు పెద్ద లాభం.. Kiwi తో ప్రతి QR పేమెంట్‌కి రివార్డు!
GST 2.0: టాటా కార్లపై ప్రత్యేక ఆఫర్లు..! GST రేట్ల తగ్గింపు, వినియోగదారులకు భారీ లాభం!