ఏపీలో రేషన్ పంపిణీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ సర్కార్ రేషన్ ను నేరుగా ఇంటికే అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసింది. వీటిని కూటమి సర్కార్ రాగానే దాదాపుగా పక్కనబెట్టేసింది. ఇప్పుడు వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రేషన్ డెలివరీ వాహనాల వల్ల రేషన్ పంపిణీ సక్రమంగా జరగడం లేదని, అందుకే తిరిగి చౌక దుకాణాల్లో రేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ప్రతీ రేషన్ వాహనానికీ నెలకు 27 వేలు చెల్లిస్తున్నామని, అయినా రేషన్ పంపిణీపై లబ్దిదారుల్లో అసంతృప్తి ఉందన్నారు. అందుకే తిరిగి చౌకదుకాణాల్లోనే రేషన్ పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!
గతంలో 29 వేల రేషన్ షాపుల ద్వారా పంపిణీ జరిగేదని, కానీ వైసీపీ ప్రభుత్వం కేవలం 9 వేల వాహనాలతో రేషన్ పంపిణీ చేసిందన్నారు. దీని వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం తిరిగి రేషన్ షాపుల్లోనే బియ్యం సహా ఇతర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు 66 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇళ్ల వద్దనే రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి చౌక దుకాణాలు 15వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయన్నారు. ఆ సమయంలో రేషన్ ను తీసుకోవాలని లబ్దిదారులకు సూచించారు.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ డ్రైవర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..! అర్హతలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దిగి వచ్చిన మెట్రో.. టికెట్ ధరలు తగ్గింపు.. ఎంతంటే!
ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! ప్రమోషన్‌తో పాటుగా నెలకు జీతం పెంపు..!
వల్లభనేని వంశీ కేసులో కీలక మలుపు..! పీటీ వారెంట్ అమలుపై హైకోర్టు బ్రేక్!
మహానాడు కోసం భారీ ఏర్పాట్లు! కీలక నేతల ఆధ్వర్యంలో 19 కమిటీలు!
చంద్రబాబు కీలక ప్రకటన.. అధికారుల గుండెల్లో గుబులు! జూన్ 12 తర్వాత ఎప్పుడైనా..
తల్లికి వందనం పై లేటెస్ట్ అప్డేట్! కొత్త నిబంధనలతో... అర్హులు వీరే!
మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్టు టీచర్లకు ఊరట..! కీలక ఉత్తర్వులు జారీ..!
విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్..! కేవలం 9 గంటల్లో..!
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
వైసీపీకి మరోసారి దెబ్బ మీద దెబ్బ! ఒకే రోజు రెండు వరుస షాకులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: