అన్నాచెల్లెల అనురాగానికి, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ఈ ఏడాది ఆగస్ట్ 9న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, వినియోగదారుల కోసం తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేసింది.
ఈ ప్రత్యేక కవర్ ద్వారా రాఖీలను మన దేశంతో పాటు విదేశాలకు కూడా స్పీడు పోస్టు మరియు సాధారణ పోస్టు సేవల ద్వారా పంపే అవకాశం కల్పించబడింది. దూరప్రాంతాల్లో ఉన్న సోదరులకి రాఖీలు పంపాలనుకునే చెల్లెళ్లు, ఈ కవర్‌లో రాఖీని ఉంచి తగిన చిరునామాతో పంపించవచ్చు. కవర్‌పై ప్రింట్ అయిన అడ్రస్‌కు నేరుగా బట్వాడా చేయడానికి తపాలా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ పోస్టల్ కవర్ ధర రూ.15 కాగా, దీనిపై జీఎస్టీ వర్తిస్తుంది.
మీ సోదరికి ప్రత్యేకమైన గిఫ్ట్ ఆలోచన..!రాఖీ పండుగ సందర్భంగా ఆర్థిక భద్రతను అందించే బహుమతులు ఇవ్వడం ట్రెండ్ అవుతోంది. SIP (Systematic Investment Plan) ద్వారా మీ సోదరి పేరు మీద పెట్టుబడి ప్రారంభించడం, ఆమె భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాగే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలలో డిపాజిట్ చేసి, మెరుగైన వడ్డీతో కూడిన సేవింగ్స్ ఇవ్వొచ్చు. స్టాక్స్ లేదా బాండ్ గిఫ్ట్ చేయడం కూడా ఒక వైవిధ్యమైన సర్‌ప్రైజ్ అవుతుంది.