తెదేపా ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుసు కాబట్టి పద్దతిగా నడుచుకుంటున్నారని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి అక్కడక్కడ గాడి తప్పుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి ముఖాముఖి మాట్లాడానని తెలిపారు. “గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు ఒకసారి పిలిచి పద్దతి మార్చుకోవాలని చెబుతాను.
తీరు మారకపోతే రెండోసారీ పిలిచి చెబుతాను. అప్పటికీ మారకపోతే మూడోసారి చెప్పడం ఉండదు. కఠినంగా వ్యవహరిస్తాను. అసలు రెండోసారి పిలవాలా వద్దా అన్నది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది” అని ఘాటుగా హెచ్చరించారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో... పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు, కమిటీల ఎంపికపై నియమించిన త్రిసభ్య కమిటీల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. "కూటమి బాగుంటేనే ప్రజలూ బాగుంటారు. ప్రజాప్రతినిధులే తప్పులు చేయడం సరికాదు.
సమన్వయకర్తలు, ఇన్ఛార్జి మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పండి" అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు 6న అనంతపురంలో సూపర్‌సెక్స్ సూపర్హీట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. "గెలిచాం.. అధికారంలో ఉన్నామని ధీమా వద్దు. వైకాపా తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉండొద్దు. ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలి" అని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. “సంక్షేమ పథకాలపై చర్చ జరగకూడదనేది వైకాపా ప్రధాన లక్ష్యం. కానీ చేసిన మంచిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.
“పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రత్యేకదృష్టి సారించాం. మొహమాటాలకు పోయి డమ్మీలు, బలహీనుల్ని ఎంపిక చేస్తే ప్రభుత్వం, పార్టీ నష్టపోతాయి. పార్లమెంటరీ కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలి. కమిటీల నియామకంలో సోషల్ రీఇంజినీరింగ్ జరగాలి. అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించాలి. బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలి. కమిటీలు బలంగా, చురుగ్గా” ఉండాలి అని చంద్రబాబు తెలిపారు.
"తెదేపా సిద్ధాంతం చాలా బలమైంది. పార్టీని రీ ఆర్గనైజ్, రీస్ట్రక్చర్ చేశాం. యువతకు అవకాశాలిస్తున్నాం. అందుకే ఇన్నేళ్లుగా పార్టీ ప్రజాదరణ పొందుతోంది. ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడికొచ్చామని, సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డామని మర్చిపోవద్దు. అధికారంలో ఉన్నాం కదా అని అలసత్వం వద్దు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచేలా నేతల పనితీరు ఉండాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకం కావాలి” అని నిర్దేశించారు.
"వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. అయినా వాటన్నింటినీ ఎదుర్కొని సంక్షేమం అమలుచేస్తున్నాం. అభివృద్ధి ఆగకుండా చూస్తున్నాం. 'సూపర్్సక్సు సూపర్హీట్ చేశాం. పథకాలు సకాలంలో అమలు కావడంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి వర్గానికీ ఏదో ఒక లబ్ధి చేకూర్చాం. ఏడాదిలోనే ఇన్ని పనులు చేయడం గొప్ప ముందడుగు” అని తెలిపారు.