రాజధాని మహిళలపై సాక్షి డిబేట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎనలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శనివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో రాజధాని రైతులు మహిళలు, టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవతల రాజధాని అమరావతిని రాజధాని గ్రామాలలో మహిళలను అవమానకర రీతిగా మాట్లాడిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఉద్యమం కోసం మహిళలు సైతం నిద్రాహారాలు మాని పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన వారిని సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి వేశ్యల రాజధాని అని మహిళలను అసభ్యకరమైన రీతిలో మాట్లాడుతూ కించపరిచిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళలను కించపరిచే విధంగా అమరావతి రాజధాని మహిళలను వేశ్యల అనడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లూ మీడియాలో కావాలని రాజధాని నిర్మాణ పనులు అడ్డుకోవడానికి అమరావతి మీద విషం చిమ్ముతున్నారని వారు మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు కీలక నిర్ణయం.. వారికి వార్నింగ్! పార్టీకి చెడ్డపేరు తెస్తే..
అమరావతి మహిళలను జగన్మోహన్ రెడ్డి తో పాటు బ్లూ మీడియా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నారని వారు ఆవేదన చెందారు. అంతేకాకుండా కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా రెచ్చగొడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సాధన కోసం గత ప్రభుత్వ హయాంలో మహిళలు లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తు చేశారు. మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ మహిళలకు అనేక ప్రయోజనకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. రాజధాని ప్రాంతంలో మహిళలకు వారికి జీవనోపాధి కల్పించడం కోసం ఉచితంగా కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చి, శిక్షణ అనంతరం ఉచితంగా వారికి కుట్టుమిషన్లను అందజేస్తూ మహిళల జీవనోపాధికి ఎంతగానో మంత్రి నారా లోకేష్ తోడ్పడుతుంటే, బ్లూ మీడియాలో మాత్రం మహిళలను కించపరిచే విధంగా ప్రచారాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రసారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే రాజధాని మహిళలకు సాక్షి యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో అమరావతి మహిళా జేఏసీ నాయకురాలు ఆకుల జయ సత్య, దళిత జేఏసీ నాయకులు వేమూరి మైనర్ బాబు, రైతు నాయకులు తోట పార్థసారథి తోట సాంబయ్య, ఆవల రవికిరణ్, రుద్ర కోటేశ్వరరావు, ఈ పూరి పెద్దబ్బాయి, ఎర్రగుంట్ల భాగ్య రావు, శ్రీనివాసరావు రాజేశ్వరి ఎలమంచిలి పద్మజ, నీలం అంకారావు, తోటా శీను బాబు కట్ట పోగు కిషోర్ రుద్ర శ్రీనివాసరావు, బత్తుల నాగరాజు, తోట సాంబ,తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: