భారతదేశపు అగ్రగామి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ప్రతిష్టాత్మక ఉత్సవ సేల్ ‘ది బిగ్ బిలియన్ డేస్ (TBBD) 2025’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ ఆఫర్ల పండుగ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ సభ్యులకు మాత్రం సెప్టెంబర్ 22నుంచే ప్రత్యేక యాక్సెస్ లభించనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సేల్ షాపింగ్ ప్రియులకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుందని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. ఈసారి మాత్రం మరింత విస్తృతంగా, మరింత వినూత్న ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానుంది.
ఇప్పటికే సెప్టెంబర్ 8న ప్రారంభమైన అర్లీ బర్డ్ డీల్స్ వినియోగదారుల్లో విశేషమైన ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ముఖ్యంగా బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఆఫర్లు ఊపందుకోవడంతో షాపర్లలో ఆసక్తి పెరిగింది. ఈ సేల్‌లో ప్రీమియం ఉత్పత్తుల విభాగం మరింత ఆకర్షణగా నిలవనుంది. స్మార్ట్‌ఫోన్లు, ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లు, 4కే టీవీలు, కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వంటి ఎన్నో టాప్-క్లాస్ ఉత్పత్తులు భారీ తగ్గింపుతో అందుబాటులోకి రానున్నాయి. అంటే టెక్నాలజీతోపాటు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను కూడా ఈ సేల్ ద్వారా వినియోగదారులు తక్కువ ఖర్చుతో సొంతం చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ అనే ప్రత్యేకమైన 10 నిమిషాల డెలివరీ సేవ TBBDలో భాగం అవ్వడం మరో ముఖ్యమైన ఆకర్షణగా మారింది. దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లోని 3 వేల పిన్‌కోడ్‌లకు ఈ అత్యంత వేగవంతమైన సేవ అందుబాటులో ఉండనుంది. షాపర్లకు వేగవంతమైన డెలివరీతోపాటు ఆఫర్లు మరింత చేరువ కావడం ద్వారా ఈ సేల్ ప్రత్యేక అనుభూతి కలిగించనుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న నగరాలపై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక దృష్టి సారించింది. షాప్సీ అనే తమ ప్లాట్‌ఫాం ద్వారా రూ.29 నుండి ప్రారంభమయ్యే డీల్స్, 100 శాతం సూపర్ కాయిన్ల రివార్డ్స్ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఈ చర్యల ద్వారా చిన్న పట్టణాలు, అభివృద్ధి చెందుతున్న నగరాల వినియోగదారులు కూడా సేల్ ప్రయోజనాలు సులభంగా పొందగలుగుతున్నారు.
ఈసారి బిగ్ బిలియన్ డేస్ వెనుక భారీ ప్రణాళిక కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ విభాగంలో 2.2 లక్షల ఉద్యోగాలు సృష్టించి, దేశవ్యాప్తంగా 400 కొత్త మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీని వల్ల ఉత్పత్తులు వేగంగా, సమయానికి వినియోగదారులకు చేరేలా వ్యూహరచన చేసింది. అదనంగా, బ్యాంకింగ్ భాగస్వామ్యాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐలు, యూపీఐ డిస్కౌంట్లు వంటి అనేక సదుపాయాలు కూడా షాపర్లను ఆకట్టుకోనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 కేవలం ఒక షాపింగ్ సేల్ మాత్రమే కాకుండా, డిజిటల్ ఇండియాకు మార్గనిర్దేశకంగా నిలిచే ఉత్సవంగా తీర్చిదిద్దబడుతోంది.