గత వైకాపా ప్రభుత్వం 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల్లో భారీస్థాయిలో అవినీతి జరిగిందని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాదొడ్డి పేర్కొన్నారు. దీనిపై మాట్లాడాలంటే తనకే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై 'హౌస్ కమిటీ'కి మీ ద్వారా సిఫార్సు చేస్తున్నామని సభాపతి అయ్యన్నపాత్రుడిని మంత్రి కోరారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో 'ఆడుదాం ఆంధ్రా'పై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 47 రోజుల్లో రూ.120 కోట్లు మంచినీళ్లలా ఖర్చు పెట్టారని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రాన్ని నాటి వైకాపా ప్రభుత్వం ఆడుకుందని సభ్యురాలు అఖిలప్రియ విమర్శించారు. అప్పటి మంత్రి ఆర్కే రోజా రూ.120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మరో సభ్యురాలు గౌతు శిరీష మాట్లాడుతూ.. ఎన్నికల ముందు యువతను ప్రలోభపెట్టేందుకు నాటి వైకాపా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మండిపడ్డారు. మరో సభ్యుడు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ.. ఈ క్రీడల్లో ఎన్ని జట్లు పాల్గొన్నాయి.. ఎంతమంది ఆడారు.. వారికి పారితోషికాలను ఎలా చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!
ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!
బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!
ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!
వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?
ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!
జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: