ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. ప్రస్తుతం జబర్థస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రీతూ చౌదరి తాజాగా దావత్ అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వారానికి ఓ గెస్ట్‌ను ఈ షోకి పిలిచి రోస్ట్ చేయడమే షో యొక్క ముఖ్య ఉద్దేశం. తాజాగా దావత్ షోకు నటుడు నవదీప్ గెస్ట్ వచ్చాడు. అతని సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా రీతూ చౌదరి నేరుగానే ప్రశ్నించింది. నవదీప్ హీరోగా చేసిన పోరంబోకు సినిమా చూసిన దగ్గర నుంచి నేను ఆయనకు అభిమానిగా మారిపోయానని రీతు తెలిపింది. ఆటగాళ్లే అని ఎవర్ని చూస్తే అనిపిస్తోందని ఓ ఆడియన్ అడిగిన ప్రశ్నకు ఇంకెవ్వరు మా రాణా బాబే అంటూ నవదీప్ సమాధానం ఇచ్చాడు.
ఒకనొక సమయంలో మీరు గే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది..అంటే అన్నాడు కాని ఈ ఊహ ఎంత బాగుందో అంటూ నవదీప్‌ను డైరెక్టుగానే రీతూ చౌదరి ప్రశ్నించింది. దీన్ని నవదీప్ చాలా సరదాగానే తీసుకున్నట్టు కనిపించింది. అయితే ఆయన ఈ ప్రశ్నకు నవదీప్ సమాధానం ఏమని చెప్పి ఉంటారా అని నెటిజన్లు అతృతుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి