'మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం' పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్ ప్రారంభించారు. పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం, వారికి అవసరమైన సమాచాన్ని అందించడం, వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతాయి. దీనికోసం వాట్సాప్ నంబర్ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మన మిత్ర ద్వారా తొలి విడతలో 161 రకాల సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. తొలి విడతలో ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుతాయి. సర్టిఫికెట్లు, పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు.
ఇంకా చదవండి: ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు.. కారణమిదే!
వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్నయినా సందేశాల ద్వారా ప్రజలకు పంపిస్తారు. వర్షాలు, వరదలు, విద్యుత్తు, వైద్యారోగ్యం, సబ్ స్టేషన్ల మరమ్మతులు, పర్యాటకం, మౌలిక వసతులు తదితర సమాచారం అందిస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన పలు సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డుల వంటి సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు వంటివి వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకునే వారు.... వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ టైప్ చేసి... వినతి ఏమిటో టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నంబర్ ద్వారా వినతి పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!
భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!
జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!
ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: