LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Weather: అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు.. మరోవైపు వడగాలుల హెచ్చరిక!

Weather: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. ఉత్తర శ్రీలంక తీర ప్రాంతం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

AndhraPravasi News Desk 2 min read
Weather: అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు.. మరోవైపు వడగాలుల హెచ్చరిక!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. ఉత్తర శ్రీలంక తీర ప్రాంతం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఈ ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపారు.

వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని, సురక్షిత భవనాల్లోనే ఆశ్రయం పొందాలని హెచ్చరించింది. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ దగ్గర నిలబడకూడదని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పొలాల్లో పనిచేస్తున్న వారు, పశుకాపరులు ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. చెట్ల కింద నిలబడరాదని కూడా విజ్ఞప్తి చేశారు.

మరోవైపు రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కనిపించే అవకాశముందని అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వరరామచంద్రాపురం, గుర్తేడు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 42.3 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 42.1 డిగ్రీలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 41.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41.4 డిగ్రీలు, కడపలో 41.3 డిగ్రీలు నమోదయ్యాయి.

అలాగే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 41.2 డిగ్రీలు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 40.9 డిగ్రీలు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 40.8 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెద్దపారుపూడి, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.7 డిగ్రీలు నమోదయ్యాయి. మర్కాపురం జిల్లా నందనమారెళ్లలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచిస్తోంది.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…