చెన్నై ప్రముఖ డాక్టర్లకు ప్రతిష్టాత్మక 'శంకరరత్న' పురస్కారం! ప్రపంచవ్యాప్త ప్రముఖుల మధ్య..

Sankara Ratna Award 2025: చెన్నైలోని శంకరనేత్రాలయ ప్రధాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రవాస భారతీయ సేవాతత్పరులు శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులకు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు 'శంకరరత్న పురస్కారమ్ - 2025'ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మరో లక్ష డాలర్ల విరాళాన్ని ప్రకటించడంతో, సంస్థకు వారు అందించిన మొత్తం సాయం 6,25,000 డాలర్లకు చేరింది. వీరి సహకారంతో చెన్నైలో నూతన 'మేసు' బస్సు యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులకు 'శంకరరత్న' పురస్కారం!
శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులకు 'శంకరరత్న' పురస్కారం!
  • ప్రసాద్ రెడ్డి దాతృత్వాన్ని కొనియాడిన మాజీ గవర్నర్ నరసింహన్, శంకరనేత్రాలయ చైర్మన్ సురేంద్రన్!

  • ప్రసాద్ రెడ్డి ఆర్థిక సహకారంతో చెన్నైలో సరికొత్త అత్యాధునిక 'మేసు' (MESU) బస్సు యూనిట్ ఏర్పాటు!

  • రతన్ టాటా, మాధవన్ నాయర్ సరసన కాటంరెడ్డి దంపతులు.. శంకరరత్న విశిష్టతను వివరించిన బాలరెడ్డి ఇందుర్తి!

NRI: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చెన్నై శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో 'శంకరరత్న పురస్కారమ్ - 2025' ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సమాజానికి నిస్వార్థ సేవలందిస్తున్న ప్రముఖ ప్రవాస భారతీయ దాతలు శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు. చెన్నైలోని ప్రధాన ప్రాంగణంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి, కాటంరెడ్డి దంపతులకు శంకరరత్న పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ శ్రీ ఈ.ఎల్.ఎన్. నరసింహన్, శంకరనేత్రాలయ చైర్మన్ డాక్టర్ సురేంద్రన్, ఇండియా అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, అమెరికా అధ్యక్షుడు శ్రీ బాలరెడ్డి ఇందుర్తి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులకు 'శంకరరత్న' పురస్కారం!

రతన్ టాటా వంటి ప్రముఖుల సరసన నిలిచిన దంపతులు

గతంలో ఈ ప్రతిష్టాత్మక సేవా పురస్కారాన్ని దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ జి. మాధవన్ నాయర్, ఎల్ అండ్ టి మాజీ చైర్మన్ ఏ.ఎం. నాయక్, టిసిఎస్ మాజీ సిఈఓ ఎస్. రామదొరై, హెచ్‌డిఎఫ్‌సి పద్మభూషణ్ దీపక్ పరేఖ్, ప్రముఖ తమిళ దర్శకులు ఎస్.పి. ముత్తురామన్ వంటి ప్రముఖులు అందుకున్నారు.

శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులకు 'శంకరరత్న' పురస్కారం!

ఎన్ఆర్ఐ విభాగంలో గతంలో ఎస్.వి. ఆచార్య, బాలరెడ్డి ఇందుర్తి ఈ పురస్కారాన్ని పొందగా, ఇప్పుడు కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులు ఈ గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. పూర్వ గ్రహీతలైన ఎస్.పి. ముత్తురామన్, ప్రముఖ రచయిత వి.వి. రంగనాథన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

సేవలను కొనియాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ, తమిళనాడుతో పాటు శంకరనేత్రాలయతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డి దంపతుల దాతృత్వాన్ని, నిస్వార్థ సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులకు 'శంకరరత్న' పురస్కారం!

 పేదలకు కంటిచూపును ప్రసాదించే మహోన్నత క్రతువులో శంకరనేత్రాలయకు ప్రజలు, దాతలు మరింత ఆర్థిక, నైతిక సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాలో శంకరనేత్రాలయ విస్తరణ & కాటంరెడ్డి దాతృత్వం

శంకరనేత్రాలయ అమెరికా విభాగం అధ్యక్షులు శ్రీ బాలరెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కొత్త చాప్టర్లను ప్రారంభించడం వల్ల స్వచ్ఛంద కార్యకర్తల సంఖ్య పెరిగి, రికార్డు స్థాయిలో నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. ప్రసాద్ రెడ్డి దంపతులు తమ వార్షిక లాభాలలో ఏటా 2 మిలియన్ డాలర్లను విరాళాలకే కేటాయిస్తుంటారని, వారి సేవా నిరతికి న్యూజెర్సీ సెనేట్ కూడా ప్రత్యేక ప్రొక్లమేషన్ ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు. వీరి ఆర్థిక సహకారంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త చెన్నై 'మేసు' (MESU - మొబైల్ ఐ సర్జికల్ యూనిట్) బస్సు యూనిట్ రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు.

శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులకు 'శంకరరత్న' పురస్కారం!

మరో లక్ష డాలర్ల అదనపు విరాళం – $6.25 లక్షలకు చేరిన సాయం

పురస్కార గ్రహీత కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, శంకరనేత్రాలయ అందిస్తున్న ఉచిత కంటి వైద్య సేవలు వెలకట్టలేనివని, వేలాది మంది పేదలకు చూపును తెప్పిస్తున్న వైద్యులు, సిబ్బంది నిబద్ధత తమను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఈ సందర్భంగా శంకరనేత్రాలయకు అదనంగా మరో 1,00,000 డాలర్ల (లక్ష డాలర్లు) విరాళాన్ని ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు వారు అందించిన మొత్తం విరాళం 6,25,000 డాలర్లకు (దాదాపు ₹5.2 కోట్లకు పైగా) చేరింది. తద్వారా అమెరికా నుంచి శంకరనేత్రాలయకు అత్యధిక ఆర్థిక సాయం అందించిన దంపతులుగా వారు చరిత్రకెక్కారు.

శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులకు 'శంకరరత్న' పురస్కారం!

దత్తపీఠంలో స్వామీజీ ఆశీస్సులు

అవార్డు ప్రదానోత్సవం ముగిసిన అనంతరం శంకరనేత్రాలయ ప్రతినిధులు శ్రీ బాలరెడ్డి ఇందుర్తి, డాక్టర్ గిరీష్ రావు, శ్రీ స్వామినాథన్ చంద్రశేఖర్ మైసూర్‌లోని శ్రీ దత్తపీఠాన్ని సందర్శించారు. అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిని కలిసి దాదాపు 40 నిమిషాల పాటు సంస్థ చేపడుతున్న ఉచిత సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కర్ణాటకలో సంస్థ చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమాలకు స్వామీజీ తన పూర్తి ఆశీస్సులు, సహకారం ఉంటాయని హామీ ఇచ్చారు.

శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి శోభారెడ్డి దంపతులకు 'శంకరరత్న' పురస్కారం!

Tags

Be the first to react

Latest