Anti-Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం!

Anti-Paper Leak Bill: విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం, పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ చట్టం–2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా అమల్లోకి రానుంది. ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు కఠినంగా అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ చట్టంలో కఠిన శిక్షలు, వేగవంతమైన విచారణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

Anti Paper Leak Bill
Anti Paper Leak Bill

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ చట్టం-2026 అమల్లోకి.. పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం..

పరీక్షల్లో అక్రమాలకు 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా.. కొత్త చట్టం అమల్లోకి..

విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం, పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ చట్టం–2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా అమల్లోకి రానుంది. ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు కఠినంగా అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ చట్టంలో కఠిన శిక్షలు, వేగవంతమైన విచారణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

యాంటీ పేపర్ లీక్ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, మాస్ కాపీయింగ్ వంటి అక్రమాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇది అధికారికంగా చట్టంగా మారింది.

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణే ప్రధాన లక్ష్యం
ఈ చట్టం ద్వారా ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిజాయితీగా పరీక్షలు రాసే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు బలమైన న్యాయపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ చట్టం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు
పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలు, నిర్వాహకులపై ఈ చట్టం కింద అత్యంత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. చట్టంలోని ముఖ్య నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా, దోషులుగా తేలిన వారి ఆస్తులను జప్తు చేసే అధికారం, వంటి కఠిన శిక్షలను అమలు చేయనున్నారు.

ప్రతి రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
పరీక్షల అక్రమాలకు సంబంధించిన కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండకుండా ఈ చట్టంలో ప్రత్యేక నిబంధనలు చేర్చారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రోజువారీ విచారణ చేపట్టాల్సి ఉంటుంది.

విచారణకు ఖచ్చితమైన గడువులు
విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చట్టంలో స్పష్టమైన కాలపరిమితులను కూడా నిర్దేశించారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన తేదీ నుంచి రెండు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలి. దీంతో కేసుల పరిష్కారం వేగంగా జరిగి నిందితులకు త్వరగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది.

పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచే దిశగా కీలక అడుగు
ఇటీవలి కాలంలో పలు పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు వెలుగులోకి రావడంతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ చట్టం పరీక్షల వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచడంతో పాటు అక్రమాలకు పాల్పడే ముఠాలకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరీక్షలను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా నిర్వహించే దిశగా కీలక ముందడుగు పడిందని పేర్కొంది.

Be the first to react

Latest