SSB Recruitment: రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం... అర్హతలు ఇవే!! Job Notification: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్... డిగ్రీ అర్హతతో 12,256 ఉద్యోగాలు! Job Notification: నిరుద్యోగులకు బెల్ (BEL) బంపర్ ఆఫర్... పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇవే! Job Hunt: ఉద్యోగ వేటలో డేంజర్ బెల్స్... జెన్ జీ యువతనే టార్గెట్ చేస్తున్న ఆన్‌లైన్ జాబ్ స్కామ్స్! APPSC Notification: దేవాదాయ శాఖలో ఉద్యోగాల జాతర... మంత్రి ఆనం కీలక ప్రకటన SBI Recruitment: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 15,000 స్టైపెండ్! Job Notification 2026: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. రాత పరీక్ష లేకుండానే ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు! RRB Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త... 11 వేలకు పైగా ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ (RRB ALP) పోస్టుల భర్తీ! Job Notification: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏపీ విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టుల భర్తీ! UIDAI Jobs: ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాల జాతర... 344 సూపర్ వైజర్, ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్! SSB Recruitment: రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం... అర్హతలు ఇవే!! Job Notification: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్... డిగ్రీ అర్హతతో 12,256 ఉద్యోగాలు! Job Notification: నిరుద్యోగులకు బెల్ (BEL) బంపర్ ఆఫర్... పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇవే! Job Hunt: ఉద్యోగ వేటలో డేంజర్ బెల్స్... జెన్ జీ యువతనే టార్గెట్ చేస్తున్న ఆన్‌లైన్ జాబ్ స్కామ్స్! APPSC Notification: దేవాదాయ శాఖలో ఉద్యోగాల జాతర... మంత్రి ఆనం కీలక ప్రకటన SBI Recruitment: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 15,000 స్టైపెండ్! Job Notification 2026: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. రాత పరీక్ష లేకుండానే ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు! RRB Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త... 11 వేలకు పైగా ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ (RRB ALP) పోస్టుల భర్తీ! Job Notification: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏపీ విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టుల భర్తీ! UIDAI Jobs: ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాల జాతర... 344 సూపర్ వైజర్, ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్!

Bank Jobs 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్: 104 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Bank Jobs 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 104 డిప్యూటీ మేనేజర్ మరియు ఏవీపీ (AVP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత కలిగిన వారు ఏప్రిల్ 16, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు

Published : 2026-03-27 08:28:00

Bank Jobs 2026: బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు 'బ్యాంక్ ఆఫ్ బరోడా' (BoB) ఒక శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 104 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా డిప్యూటీ మేనేజర్, ఏవీపీ (AVP) వంటి కీలక పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు నేటి నుంచే (మార్చి 27) ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులను గమనిస్తే.. డిప్యూటీ మేనేజర్ (సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్) విభాగంలో అత్యధికంగా 70 ఖాళీలు ఉన్నాయి. అలాగే వెల్త్ స్ట్రాటజిస్ట్ విభాగంలో 13 పోస్టులు, ఏవీపీ II గ్రూప్ హెడ్ విభాగంలో 4, ఏవీపీ II టెరిటరీ హెడ్ విభాగంలో 17 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి బ్యాంక్ నిబంధనల ప్రకారం భారీ జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి.

అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కేవలం చదువు మాత్రమే కాకుండా, నోటిఫికేషన్‌లో అడిగిన విధంగా ఆయా రంగాల్లో పని అనుభవం ఉండటం తప్పనిసరి. మార్చి 1, 2026 నాటికి వయస్సును లెక్కిస్తారు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 24 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఏవీపీ పోస్టులకు గరిష్టంగా 45 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 16, 2026 లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.175 గా నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కేవలం మార్కులపైనే కాకుండా, రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుంది.

బ్యాంకింగ్ కెరీర్‌ను ఉన్నత స్థాయిలో ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూసుకుని, గడువు ముగియక ముందే అప్లై చేసుకోవడం ఉత్తమం. సరైన ప్రిపరేషన్  అనుభవం ఉంటే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదు.

Spotlight

Read More →