Indian Railways: నేటి నుండి రైలు ప్రయాణం కూడా ఖరీదేనా.. టికెట్ ధరలు పెంపు! పూర్తి వివరాలు ఇవే! Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు! Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? Satellite Railway Station: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్! భూముల ధరలకు రెక్కలు! Indian Railways: నేటి నుండి రైలు ప్రయాణం కూడా ఖరీదేనా.. టికెట్ ధరలు పెంపు! పూర్తి వివరాలు ఇవే! Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు! Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? Satellite Railway Station: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్! భూముల ధరలకు రెక్కలు!

Satellite Railway Station: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్! భూముల ధరలకు రెక్కలు!

2025-12-19 10:22:00
BOI: బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్... BOI నుంచి 514 పోస్టుల నోటిఫికేషన్!

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కీలక ప్రతిపాదన ముందుకు వచ్చింది. గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి కోరారు. ఈ మేరకు వారు అధికారికంగా వినతిపత్రం సమర్పించారు.

AP Farmers: రైతులకు శుభవార్త! ఇక నుండి అవి నేరుగా ఇంటికే పంపిణీ... కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!

గొల్లపూడిలో శాటిలైట్ లేదా హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటైతే విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఉన్న ప్రయాణికుల భారం గణనీయంగా తగ్గుతుందని ఎంపీలు వివరించారు. అలాగే అమరావతి రాజధానికి రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ ప్రాంతం నగరానికి కేంద్రంగా ఉండటంతో పాటు రోడ్డు, రైలు, వాయుమార్గాలతో అనుసంధానానికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.

Violence Alert: బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌పై దాడి…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్!

గొల్లపూడి పరిసరాల్లో రైల్వే అవసరాలకు అనువైన ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సులభంగా సేకరించవచ్చని ఎంపీలు రైల్వే మంత్రికి వివరించారు. భవిష్యత్తులో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి పూర్తయితే ఈ శాటిలైట్ స్టేషన్ మరింత ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. దీంతో ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

AP Government: ఏపీలో ఇకపై అవన్నీ బంద్, పూర్తిగా నిషేధం! అప్పటి నుంచే అమలు.. కీలక ఆదేశాలు!

కొండపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో నీటి నిల్వ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కొండపల్లి నుంచి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోవడం వల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. చిన్నపాటి వర్షానికే నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

Traffic Rules: శాంతిభద్రతలపై రాజీ లేదు…! పోలీసుల పనితీరుపై సీఎం క్లియర్ కట్ ఆదేశాలు!

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా డ్రైనేజీ కాలువలు, కల్వర్టులు, క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టాలని, తక్షణమే నిధులు కేటాయించాలని ఎంపీలు కోరారు. ఈ చర్యలు అమలైతే రైళ్ల రాకపోకలు మరింత సురక్షితంగా మారడంతో పాటు, స్థానిక ప్రజలు, పరిశ్రమలకు కలుగుతున్న ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.

Green Tea: ఖాళీ కడుపులో గ్రీన్ టీ తాగితే ప్రమాదమేనా? తెలుసుకోండి..
AP Tourism: కేరళ తరహాలో జలవిహారం.. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చే యోచన!
International Jobs:18 ఏళ్ళు నిండి.. ఆ అర్హత కలిగిన వారికి సువర్ణావకాశం! విదేశాల్లో ఉద్యోగాలు... లక్షల్లో జీతం!
SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం!
అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక!

Spotlight

Read More →