LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

Gulf Updates: కల్తీ కల్లు వ్యసనం.. దుబాయ్‌లో వికటించిన వైనం డిచుపల్లి వాసి గంగాధర్ కోసం ఎన్నారై సెల్ ప్రత్యేక చొరవ!

Gulf Updates: స్వగ్రామంలో కల్తీ కల్లు (గుల్ఫారం) సేవించే అలవాటు వలన దుబాయిలో మానసిక అస్థిరతకు గురైన నిజామాబాద్ జిల్లా డిచుపల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన మొద్దు గంగాధర్ హైదరాబాద్ కు చేరిన తర్వాత మానసిక వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ…

AndhraPravasi News Desk 1 min read
Gulf Updates: కల్తీ కల్లు వ్యసనం.. దుబాయ్‌లో వికటించిన వైనం డిచుపల్లి వాసి గంగాధర్ కోసం ఎన్నారై సెల్ ప్రత్యేక చొరవ!
  • Gulf: గల్ఫ్ రిటనీ కుంగుబాటు సమస్యకు ప్రభుత్వం చేయాత… 
     
  •  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి స్వయంగా వైద్యుడు కావడంతో ప్రత్యేక శ్రద్ధ..

Gulf Updates: స్వగ్రామంలో కల్తీ కల్లు (గుల్ఫారం) సేవించే అలవాటు వలన దుబాయిలో మానసిక అస్థిరతకు గురైన నిజామాబాద్ జిల్లా డిచుపల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన మొద్దు గంగాధర్ హైదరాబాద్ కు చేరిన తర్వాత మానసిక వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

గంగాధర్ ను స్వదేశానికి తెప్పించాలని, వాపస్ వచ్చిన తర్వాత డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) చికిత్స అందించాలని కోరుతూ అతని భార్య సుప్రియ ఈనెల 12న హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ లో 'సీఏం స్టేట్ లెవల్ ప్రవాసీ ప్రజావాణి' లో వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఈమేరకు జిఏడి ఎన్నారై సెల్ అధికారులకు లేఖ రాశారు. 

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 నిబంధనల ప్రకారం... మొద్దు గంగాధర్ ను హైదరాబాద్ లోని మానసిక ఆరోగ్య సంస్థలో చేర్చుకొని చికిత్స అందిస్తామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సూపరింటెండెంట్ ఈ నెల 22న  ఎన్ఓసీ జారీ చేశారు. 

"రోగి ఆసుపత్రిలో చేరిన సమయంలో కుటుంబ సభ్యులు లేదా బంధువులు అతనితో ఉండి బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉంటే, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 లోని సెక్షన్ 86 ప్రకారం ఫ్యామిలీ వార్డులో చేర్చవచ్చు. కుటుంబ సభ్యులు క్లోజ్డ్ వార్డులో చేర్పించాలని కోరిన పక్షంలో, అందుకు అవసరమైన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది." అని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…