LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

Oman: ఒమాన్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు!

Oman: ఒమాన్ దేశంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మస్కట్ మరియు సలాల నగరాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు వేర్వేరుగా ఈ కార్యక్రమాలను నిర్వహించాయి.

AndhraPravasi News Desk 1 min read
Oman: ఒమాన్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు!

అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు..

అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ తెలుగు ప్రజలు..

ఒమాన్ దేశంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మస్కట్ మరియు సలాల నగరాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు వేర్వేరుగా ఈ కార్యక్రమాలను నిర్వహించాయి. విదేశీ నేలపై కూడా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ తెలుగు ప్రజలు ఐక్యంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మస్కట్ నగరంలో అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భారత రాయబారి జి.వి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమితి అధ్యక్షుడు గాలిగాని రాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు రంజిత్, మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలి రెడ్డి సమన్వయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఒమాన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు నూనె లక్ష్మణ్, అంబేద్కర్ బోధనలు సమాజానికి ఎప్పటికీ దిక్సూచిలా నిలుస్తాయని అన్నారు.

ఇక మస్కట్‌కు దూరంగా సుమారు వేయి కిలోమీటర్ల దూరంలో ఉన్న సలాల నగరంలో కూడా జయంతి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. అక్కడ జరిగిన కార్యక్రమానికి ఉపాధ్యక్షులు రాకేశ్ అధ్యక్షత వహించగా, మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి సమన్వయం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గాలిగాని రాజు గత పదేళ్లుగా ఒమాన్‌లో అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేస్తున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రమాబాయి సేవా సమితి అధ్యక్షురాలు రత్నా (చిన్ని) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే ఏపీ దళిత యూత్ ఆధ్వర్యంలో జరిగిన మరో కార్యక్రమానికి గడ్డం రాంప్రసాద్ అధ్యక్షత వహించారు.

విదేశాల్లో ఉన్నా తమ మూలాలను మరువకుండా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలుగు సమాజం కృషి ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలు ఐక్యత, సామాజిక చైతన్యం, సమానత్వం వంటి విలువలను మరింత బలపరిచాయి.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…