దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు బంగారం కొనడం కష్టంగా మారుతోంది. గత ఏడాది సుమారు రూ.60 వేల వద్ద ఉన్న బంగారం ధరలు ఇప్పుడు లక్ష రూపాయల మార్క్‌ను దాటి పరుగులు తీస్తున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,200 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,22,100 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.99,900 వద్ద ట్రేడ్ అయ్యాయి.
శనివారం నాటి తాజా ధరలను పరిశీలిస్తే, పది గ్రాముల బంగారంపై స్వల్పంగా రూ.10 పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,210గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.1,22,110 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.99,910 వద్ద ట్రేడ్ అవుతోంది. ధరలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయి. పెట్టుబడుల కోసం వెండి మంచి ప్రత్యామ్నాయంగా మారుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం కేజీ వెండి ధర రూ.2,15,000గా ఉండగా, శనివారం కేజీపై రూ.100 పెరిగి రూ.2,15,100కు చేరింది. అలాగే 100 గ్రాముల వెండి ధర రూ.21,510 వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పూణేలో రూ.13,320గా ఉంది. ఢిల్లీలో రూ.13,335గా ఉండగా, వడోదరలో రూ.13,325గా ఉంది. చెన్నైలో మాత్రం ధర ఎక్కువగా ఉండి రూ.13,495 వద్ద ట్రేడ్ అవుతోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ పరిస్థితులు బంగారం–వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ధరలు ఈ స్థాయిలో కొనసాగితే, పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేసే వారు ప్రత్యామ్నాయాలపై ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందని వారు చెబుతున్నారు.