ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు TCL మరోసారి టీవీ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కంపెనీ 55 అంగుళాల 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ QLED గూగుల్ టీవీ (మోడల్ 55T8C)పై భారీ తగ్గింపును ప్రకటించడంతో కొనుగోలుదారుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. సాధారణంగా రూ.1,09,990 ధర ఉన్న ఈ ప్రీమియం టీవీ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.36,990కి అందుబాటులోకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. అంటే 66 శాతం తగ్గింపుతో అత్యాధునిక ఫీచర్లు ఉన్న పెద్ద సైజ్ టీవీని బడ్జెట్‌లోనే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.
అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, నెలకు రూ.6,165 చొప్పున 6 నెలల నో-కాస్ట్ EMI సదుపాయం కూడా అందిస్తోంది. ఈ మోడల్ ప్రధాన ఆకర్షణ డిస్‌ప్లేనే. 55 అంగుళాల 4K QLED స్క్రీన్ (3840×2160) మరింత సహజ రంగులు, లోతైన కాంట్రాస్ట్, మెరుగైన ప్రకాశాన్ని అందిస్తుంది. TCL ప్రత్యేక AiPQ ప్రాసెసర్, 4K HDR Pro, HDR10, డాల్బీ విజన్ టెక్నాలజీలు కలిసినప్పుడు సినిమా కావొచ్చు, స్పోర్ట్స్ కావొచ్చు ఏ కంటెంట్ అయినా లైవ్ అనుభూతిని కలిగించేలా చూపిస్తాయి.
ముఖ్యంగా డిటైల్ మరియు కలర్ శక్తి ఈ ధర రేంజ్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే స్పష్టంగా మెరుగ్గా కనిపిస్తుంది.రిఫ్రెష్ రేట్ విషయంలో కూడా TCL దూసుకెళ్లింది. 144Hz మోషన్ క్లారిటీ ప్రో, 120Hz MEMC, 144Hz VRR, 240Hz DLG వంటి హైఎండ్ ఫీచర్లు వేగంగా కదిలే సన్నివేశాల్లో సైతం బ్లర్ లేకుండా స్మూత్‌గా చిత్రాన్ని చూపుతాయి. గేమింగ్ ప్రేమికులకు ప్రత్యేకంగా VRR పెద్ద అదనపు లాభం, ఎందుకంటే ఇది ల్యాగ్‌ను గణనీయంగా తగ్గించి మరింత ఫాస్ట్ మరియు రెస్పాన్సివ్‌గా మారుస్తుంది.
ఆడియో సెక్షన్ కూడా ఈసారి బలంగా ఉంది. 35W స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ కలగలిపి హోమ్ థియేటర్ తరహా ధ్వని అనుభూతిని ఇస్తాయి. లో బాస్, క్రిస్ప్ వాయిస్ క్లారిటీ, సౌండ్ డెప్త్ పెద్ద స్క్రీన్‌తో పాటు శక్తివంతమైన సౌండ్ రావడంతో వినోద అనుభవం మరింత మెరుగవుతుంది.
పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే 3GB RAM, 32GB స్టోరేజ్, 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ గూగుల్ టీవీ మల్టీటాస్కింగ్‌ను సులభంగా నిర్వహిస్తుంది. యాప్‌ల మార్పు, స్ట్రీమింగ్, క్యాస్టింగ్ అన్నీ స్మూత్. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్, స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లు వినియోగదారుల కోసం అనువుగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జీ5, యూట్యూబ్ వంటి ప్రముఖ OTT యాప్‌లు ముందే ఇన్‌స్టాల్‌డ్‌గా రావడం మరో ప్రయోజనం.
టీవీకి రెండు సంవత్సరాల వారంటీ, రిమోట్‌కు 6 నెలల వారంటీ అందుబాటులో ఉండటం వినియోగదారులకు భరోసా. వారంటీ క్లెయిమ్ కోసం అమెజాన్ ఈ-ఇన్‌వాయిస్ సరిపోతుంది. మొత్తంగా చెప్పాలంటే, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లతో 55 అంగుళాల QLED టీవీ కావాలనుకునే వారికి TCL 55T8C మోడల్ నిజంగా సూపర్ డీల్. 4K విజువల్స్, శక్తివంతమైన ఆడియో, హై రిఫ్రెష్ రేట్, గూగుల్ టీవీ అనుభవం ఈ ధరలో ఇలాంటి ఫీచర్లతో టీవీ దొరకడం అరుదే.