LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gadgets

Best Smartphone: శామ్‌సంగ్ A37, పోకో X8 ప్రో మాక్స్, వివో V70.. బడ్జెట్ ధరలో ఏది బెస్ట్?

Best Smartphone: శామ్‌సంగ్ గెలాక్సీ A37, పోకో X8 ప్రో మాక్స్ వివో V70 ఫోన్ల మధ్య అసలైన పోటీ మొదలైంది. 9000mAh బ్యాటరీ, అదిరిపోయే కెమెరా ఫీచర్లు లేటెస్ట్ ప్రాసెసర్లతో వచ్చిన ఈ మొబైల్స్ ధరలు, స్పెసిఫికేషన్ల

AndhraPravasi News Desk 1 min read
Best Smartphone: శామ్‌సంగ్ A37, పోకో X8 ప్రో మాక్స్, వివో V70.. బడ్జెట్ ధరలో ఏది బెస్ట్?

Best Smartphone: మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. ప్రముఖ కంపెనీలైన శామ్‌సంగ్, పోకో  వివో తమ సరికొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తాజాగా విడుదలైన శామ్‌సంగ్ గెలాక్సీ A37, పోకో X8 ప్రో మాక్స్,  వివో V70 ఫోన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. సుమారు 40 వేల నుండి 50 వేల రూపాయల ధరలో ఉన్న ఈ ఫోన్లలో ఏది బెస్ట్ అనే చర్చ టెక్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A37 విషయానికి వస్తే, ఇది సాఫ్ట్‌వేర్ నమ్మకానికి పెట్టింది పేరు. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ భరోసా ఇస్తోంది. ఇందులో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, ఇది ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ధర సుమారు ₹41,999 నుండి మొదలవుతోంది. ఫోన్ ఎక్కువ కాలం మన్నాలి అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

ఇక గేమింగ్ ప్రియుల కోసం పోకో X8 ప్రో మాక్స్ సిద్ధంగా ఉంది. ఇందులో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్, గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ పిచ్చి ఉన్నవారికి వివో V70 సరైన ఎంపిక. జైస్ (Zeiss) లెన్స్‌తో కూడిన కెమెరా సెటప్ ఇందులో ప్రధాన ఆకర్షణ. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వడం విశేషం. మిగతా వాటితో పోలిస్తే ఇది చూడటానికి చాలా సన్నగా, స్టైలిష్‌గా ఉంటుంది. దీని ధర ₹45,999 నుండి ప్రారంభమవుతోంది. చివరగా చెప్పాలంటే, మీకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కావాలంటే శామ్‌సంగ్, బ్యాటరీ లైఫ్ పర్ఫార్మెన్స్ కావాలంటే పోకో, లేదా కెమెరా క్వాలిటీ ముఖ్యం అనుకుంటే వివో వైపు మొగ్గు చూపవచ్చు. మీ అవసరాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Be the first to react

More Coverage

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కొనుగోలు…

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇస్తూ డెల్ సంస్థ తన ప్రీమియం ‘ఎక్స్‌ప…