LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gadgets

OnePlus Nord 6: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6.. ఏప్రిల్ 7న గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

OnePlus Nord 6: వన్‌ప్లస్ నార్డ్ 6 భారత మార్కెట్లోకి ఏప్రిల్ 7న విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్, 9000mAh భారీ బ్యాటరీ మరియు 165Hz రిఫ్రెష్ రేట్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు..

AndhraPravasi News Desk 2 min read
OnePlus Nord 6: 9000mAh  బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6.. ఏప్రిల్ 7న గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

OnePlus Nord 6: వన్‌ప్లస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ 6  భారత మార్కెట్లోకి రావడానికి సిద్ధమైపోయింది. గతేడాది వచ్చిన నార్డ్ 5కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్, ఏప్రిల్ రెండో వారంలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అమెజాన్ వంటి ఇ-కామర్స్ సైట్లలో ప్రత్యేక పేజీలు కూడా కనిపిస్తుండటంతో, టెక్ ప్రియుల్లో ఈ ఫోన్ మీద అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ కొత్త మోడల్ డిజైన్ పరంగా గతంలో కంటే కాస్త భిన్నంగా ఉండబోతోంది. ఫోన్ వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉండనుంది. ఇందులో రెండు పవర్‌ఫుల్ కెమెరాలతో పాటు ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటుంది. దీని ఫ్రేమ్ మెటల్‌తో తయారై, ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. కంపెనీ దీనిని ఫ్రెష్ మింట్, పిచ్ బ్లాక్, క్విక్ సిల్వర్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకొస్తోంది. యువతను ఆకట్టుకునేలా ఈ కలర్స్ ఉండనున్నాయి.

డిస్‌ప్లే విషయానికొస్తే, ఇందులో 6.78 అంగుళాల అమోలెడ్ (AMOLED) స్క్రీన్‌ను అమర్చారు. దీనికి 1.5K రిజల్యూషన్ మరియు 165Hz రిఫ్రెష్ రేట్ తోడు కావడంతో, గేమింగ్ మరియు వీడియోలు చూసేటప్పుడు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా 'ఆక్వా టచ్ 2.0' టెక్నాలజీ వల్ల, చేతులు తడిగా ఉన్నా లేదా వర్షంలోనైనా ఫోన్ స్క్రీన్ ఏ ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం.

పర్ఫార్మెన్స్ పరంగా వన్‌ప్లస్ ఎక్కడా తగ్గడం లేదు. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్‌ను వాడుతున్నారు. ఇది ఫోన్ వేగాన్ని విపరీతంగా పెంచుతుంది. 12GB వరకు ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఆప్షన్లతో ఈ ఫోన్ దొరకనుంది. బ్యాటరీ విషయమైతే వినియోగదారులు ఆశ్చర్యపోవాల్సిందే. ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండున్నర రోజుల పాటు వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

 ధర విషయానికి వస్తే, వన్‌ప్లస్ నార్డ్ 6 ఇండియాలో రూ. 35,000 నుండి రూ. 40,000 మధ్యలో ఉండవచ్చని అంచనా. పాత మోడల్ నార్డ్ 5 కంటే దీని ధర మూడు నుండి ఐదు వేలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 7 గంటలకు జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో దీని అసలు ధర  ఇతర ఆఫర్ల గురించి పూర్తి స్పష్టత రానుంది.

Be the first to react

More Coverage

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కొనుగోలు…

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇస్తూ డెల్ సంస్థ తన ప్రీమియం ‘ఎక్స్‌ప…