LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gadgets

Motorola Edge 60: మోటరోలా షాక్...‌ ఇండియాలో పెరిగిన ఎడ్జ్ 60 ఫ్యూజన్ G-సిరీస్ ఫోన్ల ధరలు!

Motorola Edge 60: భారత్‌లో మోటరోలా స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, మోటో G57 పవర్ G35 మోడల్స్ పై కంపెనీ ధరలను పెంచినట్లు సమాచారం..

AndhraPravasi News Desk 2 min read
Motorola Edge 60: మోటరోలా షాక్...‌ ఇండియాలో పెరిగిన ఎడ్జ్ 60 ఫ్యూజన్  G-సిరీస్ ఫోన్ల ధరలు!

Motorola Edge 60: మీరు కొత్తగా మోటరోలా ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక చేదు వార్త. ప్రముఖ మొబైల్  కంపెనీ మోటరోలా తన పాపులర్ ఫోన్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే 'ఎడ్జ్ 60 ఫ్యూజన్'తో పాటు బడ్జెట్ ధరలో లభించే G సిరీస్ ఫోన్ల రేట్లు కూడా ఇప్పుడు భారీగా పెరిగాయి. మార్కెట్ నిపుణుల సమాచారం ప్రకారం, కొత్త ధరలు ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

మోటరోలా ఫోన్లలో బాగా అమ్ముడయ్యే Motorola Edge 60 Fusion ధర ఏకంగా 2,000 రూపాయలు పెరిగింది. గతేడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ ఫోన్, అప్పట్లో 8GB+128GB వేరియంట్ రూ. 20,999కి లభించేది, కానీ ఇప్పుడు అది రూ. 22,999కి చేరుకుంది. అలాగే 256GB మోడల్స్ కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. ఒకేసారి రెండు వేల రూపాయలు పెరగడం వల్ల ఈ ఫోన్ కొనాలనుకునే వారు ఇప్పుడు కాస్త వెనకడుగు వేస్తున్నారు.

కేవలం ఖరీదైన ఫోన్లే కాదు, సామాన్యులు కొనే Moto G35, Moto G57 Power ఫోన్ల ధరలు కూడా మారాయి. మోటో G35 బేస్ వేరియంట్ ధర 500 రూపాయలు పెరిగి రూ. 12,499కి చేరగా, 8GB వేరియంట్ ధర వెయ్యి రూపాయలు పెరిగింది. అలాగే పెద్ద బ్యాటరీతో వచ్చే మోటో G57 పవర్ ధర ఇప్పుడు రూ. 14,999 నుండి రూ. 15,999కి పెరిగింది. దీనివల్ల బడ్జెట్ ఫోన్ల కోసం చూసే కస్టమర్ల జేబుకు చిల్లు పడక తప్పడం లేదు.

అయితే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం ఫోన్లలో వాడే పార్ట్స్  రేట్లు పెరగడమేనని తెలుస్తోంది. ముఖ్యంగా మెమరీ చిప్స్  డిస్‌ప్లే తయారీ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై వేస్తున్నాయి. కేవలం మోటరోలా మాత్రమే కాకుండా ఇటీవలే సామ్‌సంగ్, ఒప్పో, వివో వంటి కంపెనీలు కూడా తమ ఫోన్ల ధరలను కొద్దిగా పెంచిన సంగతి తెలిసిందే.

ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో  ప్రస్తుతం కొన్ని ఆఫర్లు నడుస్తున్నప్పటికీ, పాత ధరలతో పోలిస్తే ఇప్పుడు ఫోన్లు కొనడం కొంత ఖర్చుతో కూడుకున్న పని. ధరలు పెరగడంపై మోటరోలా నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ మీరు ఈ ఫోన్లను కొనాలనుకుంటే, బ్యాంక్ డిస్కౌంట్లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న ధరలు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు  టిప్‌స్టర్ల సమాచారం ఆధారంగా ఇవ్వబడ్డాయి. కొనే ముందు ఒకసారి అధికారిక సైట్‌లను తనిఖీ  చేసుకోవడం మంచిది.

Be the first to react

More Coverage

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కొనుగోలు…

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇస్తూ డెల్ సంస్థ తన ప్రీమియం ‘ఎక్స్‌ప…