LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gadgets

Infinix Note 60 Pro: భారత్‌లోకి ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే డిజైన్, కలర్ ఆప్షన్స్ ఇవే!

Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో భారత్‌లో ఏప్రిల్ 13న విడుదల కానుంది. 50MP OIS కెమెరా, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ మరియు మూడు సరికొత్త రంగుల్లో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు డిజైన్ వివరాలు

AndhraPravasi News Desk 2 min read
Infinix Note 60 Pro: భారత్‌లోకి ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే డిజైన్, కలర్ ఆప్షన్స్ ఇవే!

Infinix Note 60 Pro:  ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్, తన కొత్త మోడల్ 'నోట్ 60 ప్రో'ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అవుతుంది. వచ్చే వారం ఈ ఫోన్ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన లుక్, డిజైన్  ఏయే రంగుల్లో లభిస్తుందనే వివరాలను అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను సరికొత్త హంగులతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

కొత్త ఫోన్ మొత్తం మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. అవేంటంటే.. డీప్ ఓషన్ బ్లూ, మోచా బ్రౌన్  సోలార్ ఆరెంజ్. గ్లోబల్ మార్కెట్‌తో పోలిస్తే ఇండియాలో తక్కువ రంగులు ఉన్నప్పటికీ, ఉన్నవి మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. ఫోన్ వెనుక భాగం ఫ్లాట్‌గా ఉండి, పట్టుకోవడానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే, వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అమర్చారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కూడా ఉంది, దీనివల్ల ఫోటోలు షేక్ అవ్వకుండా చాలా స్పష్టంగా వస్తాయి.

డిజైన్ పరంగా చూస్తే, ఈ ఫోన్‌లో ఆపిల్ ఐఫోన్‌లలో ఉండే 'కెమెరా కంట్రోల్' బటన్ వంటి ఒక ప్రత్యేక బటన్‌ను కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇది ఫోన్ కుడి వైపున పవర్ బటన్ కింద ఉంటుంది. దీనివల్ల కెమెరాను ఆపరేట్ చేయడం యూజర్లకు చాలా సులభం అవుతుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో 'యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇందులో ఉండే చిన్న చిన్న ఎల్‌ఈడీ లైట్లు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మెరుస్తూ యూజర్లను అలరిస్తాయి.

టెక్నికల్ అంశాల గురించి మాట్లాడితే, ఇందులో 6.78 అంగుళాల పెద్ద అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది, అంటే గేమింగ్ ఆడేటప్పుడు లేదా వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫోన్ వేగంగా పనిచేయడానికి ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌ను వాడారు. బ్యాటరీ లైఫ్  ఛార్జింగ్ స్పీడ్ కూడా యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 13న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. లాంచ్ అయిన వెంటనే ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లోనూ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మధ్యతరగతి బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ధర ఎంత ఉండబోతుందనేది లాంచ్ రోజున క్లారిటీ రానుంది.

Be the first to react

More Coverage

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కొనుగోలు…

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇస్తూ డెల్ సంస్థ తన ప్రీమియం ‘ఎక్స్‌ప…