దయచేసి మా ఫోన్లు కొనకండి! వాటి రాకతో కనుమరుగవుతున్న ఐఫోన్ క్రేజ్!

IPhone: భారతదేశంలో ఐఫోన్ల ధరలు ఒకేసారి 40% వరకు పెరగడం వెనుక ఆపిల్ వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్ ఉందని లేమ్యాన్ స్టూడియో విశ్లేషించింది. ఈఎంఐలు, క్విక్ కామర్స్ వల్ల ఐఫోన్ అందరికీ చేరి తన ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ విలువను కోల్పోతుండటం (బ్రాండ్ డైల్యూషన్), అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ సిరీస్ సంపన్న వర్గాలను ఆకర్షిస్తుండటంతో ఆపిల్ మేల్కొంది. మిడిల్ క్లాస్ కొనుగోళ్లకు చెక్ పెట్టేలా బేస్ ధరలను రూ.1 లక్షకు పెంచడంతో పాటు, రూ.3 లక్షల ఫోల్డబుల్ ఫోన్ ద్వారా తన స్టేటస్ సింబల్ హోదాను కాపాడుకునేందుకు 'హాలో ఎఫెక్ట్', 'డెకాయ్ ప్రైసింగ్' అస్త్రాలను ప్రయోగించింది.

iPhone craze fading with the arrival of foldable phones
iPhone craze fading with the arrival of foldable phones
  • మహీంద్రా థార్ లాగే పరువు బజారుపాలు: వీధికో ఫోన్‌‌తో ఆవిరైపోయిన ఎక్స్‌క్లూజివ్ స్టేటస్!

  • ఈఎంఐ గిమ్మిక్కుల పతనం: క్విక్ కామర్స్ డెలివరీలతో నేలమట్టమైన బ్రాండ్ వాల్యూ!

  • రూ.3 లక్షల ఫోల్డబుల్ డ్రామా: పతనమవుతున్న సేల్స్‌ను కాపాడుకునేందుకు ఫేక్ బిల్డప్!

Gadgets: ఒకప్పుడు బేస్ ఐఫోన్ మోడల్ సాధారణంగా రూ.65,000 నుంచి రూ.80,000 మధ్య లభించేది. కానీ సరికొత్త సిరీస్‌లో బేస్ మోడల్ ధర ఏకంగా రూ.1 లక్ష మార్కును తాకగా, టాప్-ఎండ్ ప్రో మ్యాక్స్ మోడల్ రూ.2.25 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు ఎగబాకింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చరిత్రలోనే గత ఏడాదితో పోలిస్తే భారత్‌లో ఏకంగా 40% వరకు ధర పెరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెమొరీ చిప్స్ కొరత, ఏఐ డేటా సెంటర్ల డిమాండ్ కారణమని ఆపిల్ అధికారికంగా చెబుతున్నప్పటికీ.. అమెరికాలో కేవలం 8 నుంచి 13% పెరిగిన ధరలు, భారత్‌లో మాత్రం 20 నుంచి 40% వరకు ఎందుకు పెరిగాయన్న ప్రశ్నకు సమాధానం లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.

స్టేటస్ సింబల్ హోదాను దెబ్బతీసిన ఈఎంఐ, క్విక్ కామర్స్ సంస్కృతి

భారతదేశంలో చాలా ఏళ్ల పాటు ఐఫోన్ అనేది అత్యున్నత సామాజిక హోదాకు (Status Symbol) తిరుగులేని ప్రతీకగా ఉండేది. అయితే నో-కాస్ట్ ఈఎంఐలు, సులభమైన బ్యాంక్ క్రెడిట్ కార్డు రుణాలు మరియు బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే ఐఫోన్ చేతికి రావడం మొదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ చేతిలో ఉండే ఫోనే, అదే ఆఫీసులో కొత్తగా చేరిన ఫ్రెషర్ చేతిలోనూ దర్శనమిస్తోంది. ఎప్పుడైతే ఒక ప్రీమియం లగ్జరీ ప్రొడక్ట్ అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చిందో, అప్పుడు లక్షన్నర వెచ్చించి కొనే సంపన్నులకు దానివల్ల గతంలో వచ్చే ‘ఎక్స్‌క్లూజివ్’ ఫీలింగ్ పూర్తిగా ఆవిరైపోయింది.

శామ్‌సంగ్ ఫోల్డ్ ఎంట్రీ – బోర్డ్‌రూమ్‌లలో ఆపిల్‌కు సవాలు

ఈ అంతరాన్ని సరిగ్గా పసిగట్టిన శామ్‌సంగ్ తమ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్‌తో కార్పొరేట్ మరియు సంపన్న వర్గాలను తనవైపు తిప్పుకుంది. దాదాపు రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల ఖరీదు చేసే ఈ ఫోల్డబుల్ ఫోన్లలో శామ్‌సంగ్ దాదాపు 89% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. బోర్డ్‌రూమ్ మీటింగ్ టేబుల్‌పై ఫోన్‌ను ఒక చిన్న ట్యాబ్లెట్‌లా తెరిచినప్పుడు అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫలితంగా గత పదేళ్లలో మొదటిసారిగా మీటింగ్ రూమ్‌లలో ఉండే అత్యంత ఖరీదైన ఫోన్ ఆపిల్ ది కాకుండా పోయింది. ప్రైస్ ట్యాగ్ చూడకుండా గతంలో ప్రో మోడల్స్ కొనే సంపన్న కస్టమర్లు శామ్‌సంగ్ వైపు వెళ్లిపోతుండటాన్ని ఆపిల్ సీరియస్‌గా పరిగణించింది.

మహీంద్రా థార్ కేస్ స్టడీ – బ్రాండ్ డైల్యూషన్ భయం

ఈ పరిస్థితి ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా థార్ ఎదుర్కొన్న సంక్షోభాన్ని గుర్తుచేస్తోంది. గతంలో థార్ ఒక క్లాస్, ఆఫ్-రోడింగ్ లైఫ్‌స్టైల్ వెహికల్‌గా ఉండేది. కానీ సులభమైన కార్ లోన్లు, తక్కువ ధరకే టూ-వీల్ డ్రైవ్ వెర్షన్ రావడంతో ప్రతి వీధిలోనూ కనిపించడం మొదలైంది. కాలేజీ కుర్రాళ్లు, వ్లాగర్లు రాష్ డ్రైవింగ్ చేస్తుండటంతో ఆ వాహనానికి ఒక నెగెటివ్ ఇమేజ్ వచ్చి, అసలైన ధనవంతులు డిఫెండర్, రేంజ్ రోవర్ వైపు మొగ్గు చూపారు. ఆపిల్ కూడా తమ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లో పడి 'బ్రాండ్ డైల్యూషన్' బారిన పడకుండా ఉండాలనే ముందుజాగ్రత్తతోనే కఠిన చర్యలకు ఉపక్రమించింది.

ఆపిల్ మూడు అంచెల మాస్టర్ ప్లాన్ – గేట్లు మూసివేత

ఈ సమస్యల నుంచి బ్రాండ్ విలువను రక్షించుకోవడానికి ఆపిల్ మూడు స్పష్టమైన ఎత్తుగడలు వేసింది. మొదటిది 'రైజింగ్ ది ఫ్లోర్'.. అంటే ఎంట్రీ బేస్ ధరను రూ.1 లక్షకు పెంచడం మరియు కొత్త మోడల్ వచ్చినా పాత మోడళ్ల రేట్లు తగ్గకుండా చేసి మిడిల్ క్లాస్ ఎంట్రీ గేట్లను క్లోజ్ చేయడం. రెండవది 'పుషింగ్ టువర్డ్స్ ప్రో'.. బేస్ మోడల్ కంటే ప్రో మోడళ్ల సేల్స్ పెరిగేలా చేసి అధిక మార్జిన్ల ద్వారా భారీ లాభాలు దక్కించుకోవడం. మూడవది 'ది హాలో ఎఫెక్ట్'.. ఏకంగా రూ.3 లక్షల నుంచి రూ.4.5 లక్షల ఖరీదైన ఫోల్డబుల్ మోడల్‌ను పరిచయం చేయడం ద్వారా మీటింగ్ టేబుల్‌పై అత్యంత ఖరీదైన ఫోన్ మళ్లీ ఆపిల్‌దే అనే భావనను కల్పించి, రూ.1.5 లక్షల ఫోన్ కొనడం సాధారణ విషయమే అన్న భ్రమను సృష్టించింది.

భవిష్యత్ వృద్ధికి రిస్క్ – లగ్జరీ ట్యాక్స్‌గా మారిన ఐఫోన్

ప్రపంచంలో ఉన్న అందరికీ ఫోన్లు అమ్మడం కాకుండా, అధిక లాభాలు ఇచ్చే ధనికులైన కస్టమర్లకే విక్రయించాలనే 'కస్టమర్ ఫిల్టరింగ్' విధానాన్ని ఆపిల్ ఎంచుకుంది. అయితే ఎకోసిస్టమ్‌లోకి కొత్తగా వచ్చే యువ కస్టమర్ల మొదటి అడుగును బ్లాక్ చేయడం వల్ల భవిష్యత్తులో ఆపిల్ గ్రోత్ నెమ్మదించే తీవ్ర రిస్క్ కూడా ఉంది. చాలామంది మొదట ఈఎంఐలో ఐఫోన్ కొని, ఆపై ఐప్యాడ్, మ్యాక్‌‌బుక్ వంటివి కొంటారు. ఆ దారిని మూసివేయడం కంపెనీకి దీర్ఘకాలంలో సవాలుగా మారే ప్రమాదముంది. నేడు ఐఫోన్ కొనుగోలు అనేది కేవలం టెక్నాలజీ కోసం కాకుండా, సమాజంలో తమ స్థాయిని నిరూపించుకోవడానికి కడుతున్న ఒక 'లగ్జరీ ట్యాక్స్'గా మారిపోయిందన్న విశ్లేషణలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి.

Tags

Be the first to react

Latest