ఇప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎంతో సులభమైంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏటీఎం దగ్గరికి వెళ్లకుండా, కేవలం ఒక మిస్డ్ కాల్ suffice చేస్తుంది. మీ మొబైల్ నంబర్ (Mobile Number) మీ అకౌంట్‌కి లింక్ అయి ఉంటే, కొన్ని టోల్‌ఫ్రీ నంబర్లకు మిస్డ్ కాల్ ఇస్తే బ్యాలెన్స్ మేసేజ్ రూపంలో మీ ఫోన్‌కి వచ్చేస్తుంది. ఇది బ్యాంకులు అందిస్తున్న ఓ ఉచిత సౌకర్యం.
ఈ సేవను ఉపయోగించాలంటే ముందు మీ బ్యాంక్ అకౌంట్‌తో (Bank account) మీ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఆపై, కింది బ్యాంకుల టోల్‌ఫ్రీ నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీరు మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు.
SBI: 09223766666, ICICI: 09594612612, HDFC: 18002703333, AXIS: 18004195959, UNION BANK: 09223008586, BANK OF BARODA (BOB): 8468001111, PUNJAB NATIONAL BANK (PNB): 18001802223, BANK OF INDIA (BOI): 09266135135
మీరు ఈ నంబర్లలో మీ బ్యాంక్‌కి సంబంధించిన నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే, మీ బ్యాలెన్స్ సమాచారం మీకు SMS రూపంలో వచ్చేస్తుంది. ఈ సేవ ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా వినియోగించవచ్చు.
ఈ సౌకర్యం ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రాంతాలవారు, ఇంటర్నెట్ లేని వారు ఉపయోగించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తక్కువ సమయంతో ఖాతాలో మిగిలిన డబ్బును తెలుసుకునే ఈ చిట్కా గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.