కార్గిల్ విజయం 26వ వర్షికను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగంగా స్పందించారు. భారత సైనికుల అసాధారణ ధైర్యసాహసాలను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంచుతో కమ్ముకున్న శిఖరాలపై వారు సాధించిన గెలుపు ప్రతి భారతీయుడికీ గొప్ప ప్రేరణ అని పేర్కొన్నారు.
“మన సైనికుల త్యాగానికి నమస్కారం. వారి వీరజీవితాన్ని గౌరవిస్తూ, వారసత్వాన్ని స్మరించుకుంటున్నాను” అని సీఎం చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
1999లో పాకిస్తాన్ కుట్రకు సమాధానంగా భారత ఆర్మీ ప్రారంభించిన ఆపరేషన్ విజయ్ ద్వారా కార్గిల్ యుద్ధం (Kargil War) జరిగింది. శత్రు దళాలను పట్టు బెట్టి, భారత భూభాగాన్ని కాపాడిన సైనికుల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇది జరిగి నేటికి సరిగ్గా 26 ఏళ్లు పూర్తయ్యింది.